వై.ఎస్.ఆర్. కడప క్రీడా పాఠశాలలో 4 వ తరగతి ప్రవేశాలకు ఎంపిక ప్రక్రియ

-రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ శాప్ లీగ్ టోర్నమెంట్ జిల్లా స్థాయి ఎంపికల దరఖాస్తు ల ఆహ్వానం
-జిల్లాలో యోగా శిక్షకుల నియామకం కోసం ధరఖాస్తు ఆహ్వానం
-జిల్లా క్రీడా శిక్షకులు డి.ఎం.ఎం.శేషగిరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశానికి, యోగ శిక్షకుల పోస్టులు భర్తీకి, రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ, ముఖ్య క్రీడా శిక్షకులు డి.ఎం.ఎం.శేషగిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారు వై.ఎస్.ఆర్. కడప క్రీడా పాఠశాలలో 4 వ తరగతి ప్రవేశాలకు ఎంపికలు జరుపుట జిల్లాలో గల 19 మండల హెడ్ క్వార్టర్లలో ది.11.07.2022 నుండి ది.18.07.2022 లోపు ఆయా మండలాల మండల ప్రజా పరిషత్ అభివృద్ది అధికారి వారి పర్యవేక్షణలో నిర్వహించు మండల స్థాయి ఎంపికలకు హాజరు కావాలని తెలిపారు. తదుపరి మండల స్థాయిలో ఎంపిక కాబడిన క్రీడా కారులకు జూలై 20, 21 తేదీల్లో జిల్లా స్థాయి ఎంపికను నిర్వహిస్తామని తెలిపారు. తదుపరి జిల్లా స్థాయిలో ఎంపిక కాబడిన క్రీడా కారులకు జూలై 25, 26 తేదీల్లో గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించు రాష్ట్ర స్థాయి ఎంపికలకు పంపడం జరుగుతుందని తెలిపారు. 01.08.2013 నుండి 31.07.2014 మధ్యలో జన్మించిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ప్రస్తుత పాఠశాల స్టడీ సర్టిఫికేట్, ఆధార్ కార్డు , పాస్ పోర్ట్ ఫోటోలు – 02 , పుట్టిన తేదీ ధృవపత్రము లను పొందుపరచాను తెలిపారు. మరిన్ని వివరాల కోసం నంబర్ 9490188662ను కానీ ఎం పి డి వో కార్యాలయం ను కానీ సంప్రదించగలరని కోరారు.

ఫెన్సింగ్ పోటీల కోసం జిల్లా స్థాయి ఎంపికల దరఖాస్తు ల ఆహ్వానం :
జూలై 15, 16 తేదీలలో ఇండోర్ స్టేడియం, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కర్నూల్ నందు జరుగు రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ శాప్ లీగ్ టోర్నమెంట్ లో జిల్లా తరపున పాల్గొనుట నిమిత్తము జిల్లా స్థాయి లో ఎంపికల కోసం ఆశక్తి గల క్రీడా కారులు నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతోందని జిల్లా చీఫ్ కోచ్ శేషగిరి తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వై.బి.వి.సాయి కుమార్, ఫెన్సింగ్ కోచ్ వారి 9866907151 నంబర్ ద్వారా సంప్రదించ వలసినదిగా తెలియ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వారి ఆదేశాలు మేరకు తూర్పు గోదావరి జిల్లాలో ప్లే & ప్లే పధకములో యోగా శిక్షకులుగా పని చేసేందుకు అర్హులైన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా ముఖ్య క్రీడా శిక్షకులు డి ఏం ఏం శేష గిరి తెలిపారు. యోగా శిక్షకులుగా ధరఖాస్తు చేయు అభ్యర్ధులు యోగా లో డిప్లమో లేదా పీజి డిప్లమో, డిగ్రీ లేదా సర్టిఫికేట్ కోర్సు చేసి శిక్షణలో అనుభవం కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల వారు జూలై ,12 వ తేదీలోగా ముఖ్య క్రీడా శిక్షకులు, జిల్లా క్రీడా ప్రాదికార సంస్థ, వై టి సి భవనం, బొమ్మురు, రాజమహేంద్రవరం రూరల్,తూర్పు గోదావరి జిల్లా వారికి ధరఖాస్తులను నేరుగా అందచేయ్యాలన్నారు. మరింత స్పష్టత కోసం 9490188662 ను సంప్రదించాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *