Breaking News

జూలై 11 నుంచి జూలై 24 వరకు పక్షం రోజుల పాటు జనాభా స్థిరికరణ పక్షం

-ప్రపంచ జనాభా పై అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లోకి
-డి ఎం హెచ్ వో డా.స్వర్ణలత

అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
2022.. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ” అందరికీ నిలకడగల భవిష్యత్తు వైపు – అవకాశాలను వినియోగించుకోవడం, హక్కులకు భరోసా, అందరి ఎంపికలకు అవకాశాలు “అనే నినాదంతో జరుపుకుంటున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా ఆర్. స్వర్ణలత తెలిపారు.

శనివారం సాయంత్రం అనపర్తి మండలం కుతుకులూరు పి హెచ్ సి లో ఐ ఈ సి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి ఎమ్ హెచ్ ఓ డా. ఆర్ స్వర్ణ లత మాట్లాడుతూ, జులై 11 వ తేదీన ప్రతి ఏటా ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నా మన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ, అనుబంధ విభాగాల ద్వారా జూన్ 27 నుంచి జూలై 10 వరకు సమీకరణ పక్షం కింద అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచ జనాభా నియంత్రణ కార్యక్రమాల్లో ప్రజల్లో అవగాహన కోసం అధికారులు, సిబ్బంది, వాలంటీర్లు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళవలసి కార్యక్రమాలపై అవగాహన కల్పించడం జరిగిందని స్వర్ణ లత పేర్కొన్నారు. ఈ పక్షం రోజుల లో చేపట్టిన అవగాహన, శిక్షణ కార్యక్రమం ద్వారా జూలై 11 నుంచి జూలై 25 వరకు పక్షం రోజుల పాటు జనాభా స్థిరికరణ పక్షం పేరిట ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుందన్నారు. కుటుంబ నియంత్రణ , జననాల మధ్య అంతరం (కాన్పుకు కాన్పుకు మధ్య అంతరం ), పిల్లలకు జన్మ ఇచ్చే వయస్సు విషయంలో అవగాహన, అబార్షన్ అనంతరం కుటుంబ నియంత్రణ, ముందస్తు కుటుంబ నియంత్రణ, వాటిపై రూపొందించే సందేశాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, సర్పంచ్ లను, మునిసిపల్, పంచాయతీ రాజ్ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజల్లో అవగాహన కలిగించే దిశగా అడుగులు వేయడం జరగాలని తెలిపారు.
ఇందులో భాగంగానే ఐ ఈ సి (సమాచారం, విద్య & కమ్యూనికేషన్ ) కార్యక్రమాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని సి హెచ్ సి, పి హెచ్ సి, యూ హెచ్ సి , ఆరోగ్య కేంద్రాల్లో అషా, అంగన్వాడీ, గ్రామ, వార్డు కార్యదర్శులకు, వాలంటీర్లకు, స్వచ్ఛంద సంస్థలు వాలంటీర్ లకు, నెహ్రూ యువజన కేంద్రం వాలంటీర్లకు, తదితర లకు జూలై 11 నుంచి క్షేత్ర స్థాయి లో చేపట్టవలసిన అంశాలపై అవగాహన కల్పించామన్నారు.

డిపి ఎం ఓ డా. అభిషేక్ రెడ్డి, డిప్యూటీ డి ఎమ్ హెచ్ ఓ డా. ఎన్. సత్య కుమార్, ఎస్ ఓ కుమార్ స్వామి, మెడికల్ ఆఫీసర్ డా. ఎల్. సుచిత్ర తదితరులు ధవళేశ్వరం పిహెచ్ సి లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కుటుంబ నియంత్రణ పద్దతులు పటిద్దాం.. నూతన అధ్యాయానికి నాంది పలుకుదాం.. అంటూ ప్రపంచ దినోత్సవం పై ప్రజలకు అవగాహన కల్పించారు.

1991 జూలై 11 నుంచి ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నామని వక్త లు పేర్కొన్నారు. 1987 లో ప్రపంచ జనాభా 500 కోట్లు చేరగా, 2010 నాటికి ,700 కోట్లు దాటిందన్నారు. జనాభా పెరుగుదల రేటును నియంత్రణలో ప్రజల భాగస్వామ్యంతో మాత్రమే సాధ్యం అవుతుందని, ఆ లక్ష్యం చేరే దిశగా అడుగులు వేయడం జరుగుతోంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన

-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *