విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జన్మనిస్తూ ఏ తల్లీ, పుట్టిన ఏ శిశువు మరణించరాదని అందుకు గర్భవతి సమయంలో అందించ వలసిన అన్ని రకాల వైద్య సేవలు, చికిత్సలు, పరీక్షలు వైద్యాదికారులు సకాలంలో అందించి మాతృ మరణాలను అరికట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూపుర్ అజయ్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ నూపూర్ అజయ్ వైద్యాధికారులతో సమావేశమై మెటర్నల్ డెత్ రివ్యూ కమిటీ సమావేశాన్ని నిర్వహించి ఒక మాతృ, నాల్గు శిశు మరణాల పై వైద్యాధికారులు, ఏఎన్ఎం, ఆషా, అంగన్వాడి కార్యకర్తలు, వైద్య సిబ్బందితో సమీక్షించారు. ఈ సంధర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, వైద్య సేవల ద్వారా నివారించ దగ్గ అన్ని రకాల మాతృ మరణాలను వైద్యాధికారులు ముందస్తు ప్రణాళికల ద్వారా మాతృ మరణాలు జరగ కుండా చూడాలన్నారు. గర్భ వతుల ఎడల నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శించరాదని అలాగే ఈ.డి.డి (ఎక్స్ పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ) కాన్పుకు దగ్గరలో ఉన్న గర్భవతులందరికి స్కానింగ్ మరియు ఈ.సి.జి లు నిర్వహించి లోపాలను సరిదిద్ది సురక్షిత కాన్పు జరిగేలా వైద్యాధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
Tags vijayawada
Check Also
డిల్లీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటన
-రవాణా వ్యవస్థపై క్షేత్ర స్థాయిలో సమీక్షా -రోడ్డు భద్రతా విధి విధానాలపై మంత్రి పరిశీలన -తెలంగాణ రవాణా శాఖ మంత్రి …