గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో అనధికారికంగా బ్యానర్లు, పోస్టర్స్ అంటించే సంస్థలు స్వచ్చందంగా వారే అంటించిన పోస్టర్స్ ని 24 గంటలలోగా తొలగించాలని లేకుంటే ఆయా సంస్థలపై రూ.25 వేల అపరాధ రుసుం విధిస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్ పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ చాంబర్ లో పట్టణ ప్రణాలిక, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఇష్టానుసారంగా బ్యానర్లు కడుతున్నారని, అటువంటి సంస్థలకు భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించి, అవసరమైతే పోలీసు కేసులు కూడా నమోదు చేస్తున్నామన్నారు. సోమవారం నుండి వాల్ పోస్టర్స్ అంటించే ఆయా సంస్థలను గుర్తించి నోటీసులు ఇవ్వాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. అనధికార పోస్టర్స్ ప్రింట్ చేసే ప్రింటింగ్ ప్రెస్ లను కూడా సీజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న మీడియా డివైస్ డిస్ప్లే ఫీజు వసూళ్ల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రతి వారం సమీక్షలో ఫీజు చెల్లించిన వారి వివరాలు, బకాయిదార్ల హోర్డింగ్స్, బోర్డ్ల వివరాలు తమకు అందించాలని ఆదేశించారు. రోడ్ల విస్తరణ పై సమీక్ష చేస్తూ పెద్ద పలకలూరు రోడ్ విస్తరణ పనులు పూర్తి అయ్యాయని, డ్రైన్ నిర్మాణ పనులకు శంఖుస్థాపన కూడా చేశామని, పనులు వేగంగా చేపట్టాలని డి.ఈ.ఈ.ని ఆదేశించారు. విస్తరణ జరుగుతున్న రోడ్లలో విద్యుత్ స్తంభాల షిఫ్టింగ్ కు సదరు శాఖకు చెక్ లు ఇచ్చామని, వెంటనే షిఫ్టింగ్ పనులు కూడా చేపట్టాలన్నారు. కొత్తపేట శివాలయం రోడ్ కూడా విస్తరణ పనులు పూర్తి కావస్తున్నందున డ్రైన్ నిర్మాణం పనులు ప్రారంభించడానికి సిద్దంగా ఉండాలని ఇంజినీరింగ్ అధికారులకు తెలిపారు. ఏ.టి. అగ్రహారం రోడ్ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రతి వారం నిర్దేశిత లక్ష్యం పెట్టుకొని, విస్తరణ ప్రభావిత భవనాలకు నష్ట పరిహారం ఇవ్వడం, వాటిని తొలగించడం ప్రణాళికాబద్దంగా చేపట్టాలన్నారు. డొంక రోడ్, డ్రైన్ల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని డి.ఈ.ఈ.ని ఆదేశించారు. రోడ్ల విస్తరణ పనుల్లో నష్ట పరిహారాలు, టి.డి.ఆర్.బాండ్ల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. కోర్ట్ కేసులకు పక్కాగా కౌంటర్స్, అఫిడవిట్స్ దాఖలు చేయాలన్నారు. సమావేశంలో సిటి ప్లానర్ మూర్తి, డిప్యూటీ సిటి ప్లానర్ కోటయ్య, ఏ.సి.పి.లు కాలేష, బాబురావు, అశోక్ కుమార్, అజయ్ కుమార్, టి.పి.ఎస్.లు, డి.ఈ.ఈ.లు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …