Breaking News

అక్టోబర్‌ 31న మెగా ధర్నాకు లియాఫీ పిలుపు…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అక్టోబర్‌ 31న మచిలీపట్నంలో మెగా ధర్నాకు లియాఫీ పిలుపునిస్తున్నట్లు విజయవాడలోని బీసెంట్‌ రోడ్డు చివరన వున్న సిబి-1 (686) ఎల్‌.ఐ.సీ బ్రాంచ్‌ సెక్రటరీ ఎస్‌.కె.మీరా సాహెబ్‌ తెలిపారు. శుక్రవారం బ్రాంచ్‌నందు జరిగిన నిరసన కార్యక్రమంలో ఎస్‌.కె.మీరా సాహెబ్‌ మాట్లాడుతూ ఈ నిరసన కార్యక్రమం 44వ రోజుకు చేరుకుందన్నారు. నవంబర్‌ 15న బ్రాంచ్‌ హెడ్‌ క్వార్టర్స్‌ వద్ద ఊరేగింపు, ఏజెంట్ల నిరసన తెలుపుతామన్నారు. పాలసీలపై బోనస్‌ని పెంచాలి. పాలసీలపై లోన్‌ వడ్డీరేట్లు తగ్గించాలి. కస్టమర్‌కు సమర్థవంతమైన సేవలు అందించాలి. 5 ఏళ్లకు పైబడిన ల్యాప్స్‌ అయిన పాలసీలను పునరుద్ధరించాలి. ఏజెంట్స్‌ సంక్షేమ నిధి ఏర్పాటుచేయాలి. అన్ని శాఖల్లో పౌరుల చాప్టర్‌ ప్రదర్శించాలి. ఎల్‌.ఐ.సీలో కస్టమర్‌కు పాలసీ సర్వీసింగ్‌ రేటింగ్‌ మేము డిమాండ్‌ చేస్తున్నాము. ఎల్‌.ఐ.సీలో కె.వై.సీ ఒకేసారి సమర్పణ కోరుతున్నాము. పోస్టల్‌ ప్రింటెడ్‌ బాండ్స్‌ ఆపాలి. ఏజెంట్లకు అడ్వాన్స్‌ పై వడ్డీ రేట్లు తగ్గించాలి. క్లియా ప్రయోజనాలు పెంచాలి. డైరెక్ట్‌ ఏజెంట్లకు ప్రత్యేక ప్రయోజనాలు కల్పించాలి. ఏజెంట్‌ పిల్లలకు విద్యా రుణం ఇవ్వాలి. గ్రాడ్యుటి పెంచాలి. గ్రాడ్యుటీ లెక్కింపు విధానం మార్చాలి. ఐ.ఆర్‌.డీ.ఏ ప్రకారం ఏజెంట్ల కమిషన్‌ యొక్క పునర్నిర్మాణం జరగాలి. ప్రతి ఏజెంట్‌ కు గ్రూప్‌ మెడి క్లెయిమ్‌ పెంచాలి. ధ్రువీకరించబడిన ఏజెంట్లు అందరికీ మెడి క్లెయిమ్‌ ఇవ్వాలి. కాంట్రిబ్యూటింగ్‌ పెన్షన్స్‌ స్కీమ్‌ కావాలి. గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ పెంచాలి. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పెంచాలి. టర్మ్‌ ఇన్సూరెన్స్‌ యొక్క షరతులు విడుదల చేయాలి. పాలసీలకు జీఎస్టీని తొలగించాలి. మెడి క్లెయిమ్‌ ను డీ సెంట్రలైజేషన్‌ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్‌ ప్రెసిడెంట్‌ కె.వెంకటేశ్వర్లు, బ్రాంచ్‌ కోశాధికారి కే.పిచ్చయ్య, బ్రాంచ్‌ నాయకులు, పెద్ద ఎత్తున లియాఫీ జేఏసీ నాయకులు, అసోసియేషన్‌ కార్యవర్గ సభ్యులు, ఏజెంట్లు పాల్గొని పాలసీదారులకు మెరుగైన సేవలు అందించాలని, న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేర్చాలని తమ నిరసన తెలిపారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *