Breaking News

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలి…

-సచివాలయాల ద్వారా ప్రజల సమస్యలను పారదర్శకంగా పరిష్కరించాలి..
-జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి గ్రామంలో శుక్రవారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌ పర్యటించారు. గ్రామంలో పట్టా భూముల నందు రైల్వే అధికారులు సరిహద్దురాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ ప్రాంతాన్ని జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌లతో కలిసి పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ రెవెన్యూ, రైల్వే అధికారులతో సంబంధిత భూములకు సంబంధించిన రెవెన్యూ మ్యాప్‌ని పరిశీలించి రైతుల ఫిర్యాదులను పరిగనలోకి తీసుకొని వాస్తవ పరిస్థితిని నిర్థారించడం జరుగుతుందన్నారు. అనంతరం గ్రామంలోని సచివాలయం 2 ను, అంగన్‌వాడీ కేంద్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ తనిఖీ చేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు మెనూ ప్రకారం ప్రతి రోజు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఆటపాటలతో కూడిన విద్యను బోధించాలని అంగన్‌వాడీ టీచర్లకు ఆమె ఆదేశించారు. సచివాలయ ఉద్యోగుల పనితీరును ఆరా తీసారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 వరకు సచివాలయంలో అందుబాటులో ఉండి గ్రీవెన్స్‌ నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించాలన్నారు. ఉద్యోగులు సమయానికి సచివాలయానికి హాజరుకావాలని ప్రజలు ఇచ్చే ఆర్జీలను స్వీకరించడంతోపాటు పెండిరగ్‌ లేకుండా వీలైనంత మేరకు త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని, ప్రజా సంక్షేమ పథకాలను అందించడంలో ప్రజలకు చేరువుగా ఉండాలని వివిధ విభాగాల కార్యదర్శులకు, వాలంటీర్లకు జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ ఆదేశించారు. జాయింట్‌ కలెక్టర్‌ వెంట రూరల్‌ మండల తహాశీల్థార్‌ సాయిశ్రీనివాస్‌నాయక్‌ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *