Breaking News

మహిళలపై దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం : మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినీత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలపై దాడులకు పాల్పడితే ఎటువంటి వారినైనా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ సభ్యురాలు బూసి.వినీత అన్నారు. శుక్రవారం రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినీత బాధితురాలిని పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై హాస్పిటల్ వైద్యులతో మాట్లాడిన అనంతరం భాదితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎటువంటి ఆందోళన చెందవద్దని అన్ని విధాలా అండగా ఉంటామని భాధితురాలికి మహిళా కమిషన్ సభ్యురాలు వినీత భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళా సాధికారత, రక్షణకె అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. మహిళలపై జరిగే లైంగిక వేధింపులు, దాడులు, గృహ హింస వంటివి ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని వినీత అన్నారు. ప్రతి మహిళ తమ రక్షణ కోసం మొబైల్ లో దిశ యాప్ ని ఇంస్టాల్ చేసుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *