Breaking News

ప్లాస్టిక్ వాడకం నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించాలి

-జనవరి 26 నుండి ప్లాస్టిక్ ఫ్లెక్సి బ్యానర్ల నిషేదంను పటిష్టంగా అమలు చేయాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణ లో భాగంగా ప్లాస్టిక్ ఫ్లెక్సి, బ్యానర్ల నిషేధ కార్యక్రమం ను జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణా రెడ్డి సంబందిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో కాలుష్య నియంత్రణ బోర్డ్ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ లతో అవగాహన కార్యక్రమం జరిగింది.

ఈ సంధర్భంగా కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం వారు ఏర్పాటు చేసిన సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ పర్యావరణ శాఖ వారి ఆదేశాలు జీ ఓ ఎం. ఎస్ నం. 65 తేదీ 22.9.22మరియు జి ఓ ఎం ఎస్ నం. 75 తేదీ 31.10.2022 ప్రభుత్వ నిభంధనల మేరకు ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్ల నిషేధ కార్యక్రమాన్ని జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు నుండి పటిష్టంగా అమలు చేసేలా చూడాలని తెలిపారు. ప్లాస్టిక్ ఇయర్ బడ్స్, ప్లాస్టిక్ బెలూన్స్, ప్లాస్టిక్ జెండాలు, ప్లాస్టిక్ క్యాండి స్టిక్స్, ప్లాస్టిక్ ఐస్క్రీమ్ స్టిక్స్, అలంకరణ కోసం వాడేటువంటి పాలిస్టరిన్ ( థర్మోకోల్ ) వినియోగాన్ని నిషేదించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఒకసారి వాడి పారేసిన ప్లాస్టిక్ ను వినియోగించటం జి.ఓ.ఎం ఎస్ నం. 81 తేదీ 29.11.2022 ప్రకారం నిషేధం అని తెలిపారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణ, ప్రజారోగ్యానికి కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో ప్లాస్టిక్ ఫ్లెక్సి నిషేధంపై పోస్టర్లను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు, శ్రీకాళహస్తి, పుత్తూరు, సూళ్ళూరుపేట మున్సిపల్ కమిషనర్లు బాలాజి నాయక్, కె.ఎల్.ఎన్ రెడ్డి, నరేంద్ర కుమార్, అసిస్టెంట్ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ హరీష్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి నరేంద్రబాబు,డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ.ఈ నరేంద్ర కుమార్, జిల్లా పరిశ్రమల శాఖ అదికారి ప్రతాప్, మునిసిపల్ హెల్త్ ఆఫీసర్ హరికృష్ణ , జిల్లా రవాణా శాఖ అధికారి సీతారామి రెడ్డి, డి.ఎల్.డి.ఓ సుశీలదేవి, డి పి.ఓ రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“తాలీమ్-ఎ-హునర్ (వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్)” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలియజేయునదేమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *