Breaking News

స్పందన అర్జీలను సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్

-స్పందన కు 112 అర్జీలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల ప్రజలు అందజేసిన సమస్యల అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉదయం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమoలో జాయింట్ కలెక్టర్ డి. కె బాలాజీ, డి ఆర్ ఓ శ్రీనివాసరావు, గాలేరు-నగిరి సుజల స్రవంతి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కోదండ రామిరెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు తో కలసి జిల్లా కలెక్టర్ జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీ దారుల నుండి అర్జీలను స్వీకరించారు.

మొత్తం : 112 అర్జీలు రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 71, పోలీసు శాఖ కు సంబంధించి 7, పంచాయతీ రాజ్ కు సంబంధించి 8, సర్వే కు సంబందించి 3, డ్వామా కు సంబందించి 3, జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు సంబందించి 1, ప్రజా పంపిణీ శాఖకు సంబంధించి 1, రుయా హాస్పిటల్ కు సంబంధించి 1, ఉపాధి కల్పన శాఖకు సంబంధించి 1, రిజిస్ట్రేషన్ కు సంబందించి 1, వికలాంగుల శాఖకు సంబందించి 2, సాంఘీక సంక్షేమ శాఖకు సంబందించి 1, మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి 4, అటవీ శాఖ కు సంబందించి 1, నేషనల్ హై వే కు సంబందించి 1, పరిశ్రమల శాఖ కు సంబందించి 1, పి డి ఐ సి డి ఎస్ కు సంబంధించి 2, రోడ్లు, భవనాల శాఖ కు సంబందించి 1, బీసీ సంక్షేమ శాఖ కు సంబంధించి 1, గురుకుల పాఠశాల కు సంబందించి 1 రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబందించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నాబార్డు క్రెడిట్ ప్లాన్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-2026-27 సంవత్సరానికి రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళిక అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాబార్డు క్రెడిట్ ప్లాన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *