Breaking News

3వ రోజు విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై 6వ వార్షిక బ్రహ్మోత్సవాలు 3వ రోజులో భాగంగా… సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శన మరియు పెద్దలచే అనుగ్రహ భాషనము, మరియు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి హనుమద్ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విశేషించి ఈ రోజు శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో విజయకిలాద్రి దివ్య క్షేత్రం పై వేంచేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు అందరికీ “సామూహిక శాంతి కల్యాణ మహోత్సవం” ఎంతో వైభవంగా జరిగినది. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి యొక్క మంగళ శాసనాలను పొందారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“తాలీమ్-ఎ-హునర్ (వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్)” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలియజేయునదేమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *