Breaking News

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులందరికీ ఇంధన సామర్ధ్య ఫలాలు

-ఉత్తమ ఇంధన సామర్ధ్య ఆధ్యాత్మిక కేంద్రానికి గమ్యస్థానంగా టీటీడీ ను తీర్చిదిద్దేందుకు చర్యలు
-పర్యావరణ పరిరక్షణ , విద్యుత్ ఆదా, బిల్లులను తగ్గించుకునేందుకు ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలు చేస్తున్న టీటీడీ
-ఏపీఎస్ఈసీఎం, ఏపీసీడ్కో సమన్వయంతో టీటీడీలో ప్రస్తుతం ఉన్న 118 పంపుసెట్ స్థానంలో ఇంధన సామర్థ్య పంపుసెట్లను ఏర్పాటు చేయాలని యోచన
-ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడాదికి రూ.3.17 కోట్ల విలువైన 4.5 ఎంయూ విలువైన ఇంధనాన్ని ఆదా చేసే అవకాశం
-శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో 1000 ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు , 400 బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్ (బీఎల్డీసీ) ఫ్యాన్లు భర్తీ

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త :
భక్తులందరికీ ఇంధన సామర్థ్య మరియు ఇంధన పొదుపు ప్రయోజనాలను అందించేందుకు ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనేక ఇంధన సామర్ధ్య చర్యలను అమలు చేస్తోంది. అందులో భాగంగా పాత నీటి మోటార్ల స్థానంలో స్టార్ రేటెడ్ మోటార్లను అమర్చేందుకు యోచిస్తోంది. తద్వారా ఉత్తమ ఇంధన సామర్ధ్య ఆధ్యాత్మిక కేంద్రానికి గమ్యస్థానంగా టీటీడీ ను తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోంది. పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు, విద్యుత్ ఆదాతో పాటు బిల్లులను తగ్గించుకునేందుకు టీటీడీ ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను సమర్ధవంతంగా అమలుచేసేలా నిర్ధిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతోంది.
టీటీడీ కేవలం విద్యుత్ బిల్లు కోసం సంవత్సరానికి రూ. 40 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇంధన పొదుపు మరియు ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడం ద్వారా ఈ బిల్లులను ఏడాదికి రూ.4 కోట్ల నుండి రూ. 5 కోట్ల వరకు తగ్గించుకునేలా దశలవారీగా చర్యలు చేపడుతూ వస్తోంది. అందులో భాగంగానే సాంప్రదాయ హై కెపాసిటీ విద్యుత్ మోటార్ల స్థానంలో సమర్థవంతమైన ఫైవ్ స్టార్ రేటెడ్ పంపు సెట్లను అమర్చేందుకు యోచిస్తోంది.
ఎపి స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఎపిఎస్ఇసిఎం), ఎనర్జీ డిపార్ట్మెంట్ మరియు ఎపి స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపిసిఇడిసిఓ)తో టిటిడి నీటి పంపింగ్ స్టేషన్లలో ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్పై సమీక్షా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏవీ ధర్మా రెడ్డి మాట్లాడుతూ ఏపీఎస్ఈసీఎం, ఏపీసీడ్కో సమన్వయంతో టీటీడీలో ప్రస్తుతం ఉన్న 118 పంపుసెట్ స్థానంలో ఇంధన సామర్థ్య పంపుసెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోందన్నారు. దేశంలోనే ఇంధన సామర్థ్యాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు అమలుచేస్తున్న ఏకైక యాత్రికుల గమ్యస్థానంగా టీటీడీ ను తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామన్నారు.
టీటీడీ అనేది అత్యంత ఇంధన చైతన్యం కలిగిన దేవాలయమన్న ఆయన ఇక్కడ పర్యావరణ అనుకూల కార్యకలాపాలను బలంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. దీని కోసం స్టార్ రేటెడ్ విద్యుత్ ఉపకరణాల వినియోగంతోపాటు ఇంధన సామర్థ్య సాంకేతికతలను అమలుచేసేందుకు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడం జరుగతోందన్నారు. టీటీడీ లో అమలుచేయబడే ఇంధన సామర్ధ్య కార్యక్రమాలు మన సమాజానికి మరియు ప్రకృతికి కూడా సహాయపడే పర్యావరణ అనుకూల పరిష్కారాలను ప్రోత్సహిస్తాయని తెలిపారు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సామర్థ్యానికి సంబంధించి టీటీడీని అగ్రశ్రేణి యాత్రికుల గమ్యస్థానంగా మార్చాలనుకుంటున్నామని వెల్లడించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను మెరుగుపరచడంతోపాటు ఇంధన సామర్థ్య చర్యల ప్రయోజనాలను అందించాలనే లక్ష్యంతో అత్యుత్తమ నాణ్యమైన సేవలను అందించాలని టీటీడీ కృతనిశ్చయంతో ఉందన్నారు.
టీటీడీలో ఉన్న పంపింగ్ స్టేషన్లలో ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ ఎనర్జీ ఆడిట్ (ఐజీఈఏ) నిర్వహించినట్లు ఏపీ సీడ్కో, ఏపీఎస్ఈసీఎం సీనియర్ అధికారులు వెల్లడించారు. టీటీడీ లో ప్రస్తుతం ఉన్న 118 పంపు-సెట్లను ఇంధన సమర్థవంతమైన పంపు-సెట్లతో భర్తీ చేయడానికి సుమారు రూ. 3.18 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఇది సంవత్సరానికి రూ. 3.17 కోట్ల విలువైన 4.5 ఎంయూ విలువైన ఇంధనాన్ని ఆదా చేసే అవకాశం ఉందన్నారు. ఏపీ సీడ్కో టెండర్లను మూల్యాంకనం చేసి, ఇంధన సామర్థ్య పంపు-సెట్ల ప్రాజెక్ట్ అమలు కోసం టీటీడీకు సమర్పించినట్లు తెలిపారు.
దీని పై టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పందిస్తూ, ప్రాజెక్టు ప్రతిపాదనను సమీక్షించామని తెలిపారు. దానిని టీటీడీ బోర్డు ఆమోదం కోసం పంపనున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సేవలను అందించడంలో సహాయపడే అన్ని చర్యలను తాము ప్రోత్సహిస్తామన్నారు. దేవస్థానానికి అధిక నాణ్యత మరియు నమ్మకమైన 24x 7 విద్యుత్ సరఫరాను అందించడానికి ఇంధన శాఖ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఎల్ఈడీ లైటింగ్ ఉపకరణాలు, బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్ (బీఎల్డీసీ) ఫ్యాన్ల విభాగాల్లో టీటీడీలో ఎనర్జీ ఎఫిషియెన్సీ డెమోన్స్ట్రేషన్ ప్రాజెక్టులు అమలు చేశామని ఈ సందర్భంగా ఏపీఎస్ఈసిఎం అధికారులు గుర్తుచేశారు. మొదటి దశలో ఏపీఎస్ఈసీఎం శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేసిందని తెలిపారు. ఇప్పటికే ఉన్న 1000 ట్యూబ్ లైట్ల స్థానంలో ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు మరియు 400 ఫ్యాన్లను ఎనర్జీ ఎఫిషియెంట్ బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్ (బీఎల్డీసీ) ఫ్యాన్లతో భర్తీ చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఏడాదికి 1.64 లక్షల యూనిట్ల ఇంధన ఆదా అవుతుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు.
ఇక రెండవ దశలో భాగంగా టీటీడీ భవనాలలో ప్రస్తుతం ఉన్న 5 వేల సీలింగ్ ఫ్యాన్లను బ్రష్లెస్ డైరెక్ట్ కరెంట్ (బీఎల్డీసీ) ఫ్యాన్లతో భర్తీ చేయడానికి స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ సీడ్కో)తో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుందని వివరించారు. ఇవి అత్యంత ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని చెప్పారు. ఏడాదికి రూ.62 లక్షల ఆదాతో దాదాపు 0.88 మిలియన్ యూనిట్లను ఆదా చేయగలవని తెలిపారు. ఈ పెట్టుబడి కేవలం 2 సంవత్సరాల 2 నెలల వ్యవధిలోనే తిరిగి పొందవచ్చన్నారు. ఇప్పటికే ఇంధన సామర్థ్య ఉపకరణాలు టీ టీ డీ కి సరఫరా చేయబడ్డాయని, త్వరలోనే వీటి ఏర్పాటు పనులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.
టీటీడీ చీఫ్ ఇంజనీర్ డీ నాగేశ్వరరావు, సూపెరింటెండింగ్ ఇంజనీర్ జగదేశ్వర రెడ్డి, ఎస్ ఈ (ఎలక్ట్రికల్), వెంకటేశ్వర్లు , రవిశంకర్ రెడ్డి/ఈ సి సెల్ టీటీడీ మరియు ఏపీఎస్ఈసిఎం సీనియర్ అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *