Breaking News

తూర్పు గోదావరి జిల్లాలో వై ఎస్ ఆర్ “లా” నేస్తం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్ఆర్ లా నేస్తం పథకం ద్వారా తూర్పు గోదావరి జిల్లాలోని 112 మంది యువ న్యాయవాదులకు ఈ విడతలో మొదటి ఆరు నెలలకు రూ.33.60 లక్షలు ప్రయోజనం చేకూరనుంది. బుధవారం ఉదయం వై ఎస్ ఆర్ “లా” నేస్తం జిల్లా స్థాయి కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించారు.

వైయస్ఆర్ “లా” నేస్తం పథకం ను వర్చువల్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి సిఎం క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాకు జమ చేశారు. చిత్తూరు జిల్లా 8వ  సెషన్స్ జడ్జి మరియు ఎపి ప్రభుత్వ లా కార్యదర్శి జి. సత్య ప్రభాకర్ రావు ముఖ్యమంత్రి తో కలిసి పాల్గొని సందేశం ఇవ్వడం జరిగింది

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సందేశంలో – ప్రభుత్వం న్యాయ వాదులకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెద్ద మొత్తం రూపంలో అందించడం ద్వారా వారికి సహాయకారిగా ఉంటుందన్నదే ప్రభుత్వ ఆశయం అన్నారు. ప్రభుత్వం ద్వారా అందుతున్న ఈ ప్రయోజనం ద్వారా న్యాయ వాదులు కూడా తమ వంతు సామాజిక బాధ్యతగా పేద, నిరుపేద వర్గాలకు న్యాయం చేయాలని, మేలు చేయాలన్న ఆశయం వారికి కలుగ చెయ్యడం కూడా ఇందులో ఒక ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. పేదవారి పట్ల, వారికి న్యాయం కలుగ చెయ్యడానికి యువ న్యాయ వాదులకు అంకితభావం కలుగ చేయాలన్నదే ముఖ్య కారణం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

యువ న్యాయవాదులు తొలి మూడు సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా న్యాయవాది వృత్తిలో కొనసాగడానికి ఈ మొత్తం సహాయకారిగా ఉండాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.

న్యాయవాదిగా నమోదు చేసుకున్న యువ న్యాయవాదులకు ప్రతి నెలా రూ.5 వేలు చొప్పున మూడు సంవత్సరాలపాటు ఆర్థిక సహాయం అందచెయ్యడం జరుగుతుంది.
ఈ విడత లో భాగంగా జిల్లాలోని 112 మంది న్యాయ వాదులు రూ.33.60 లక్షల ప్రయోజనం కలుగుతోంది. రాబోయే మూడు సంవత్సరాల కాలంలో రూ.2,01,60,000 మేర ఆర్థిక తోడ్పాటు అందించగలుగుతోంది. ఇకపై నెల నెలా కాకుండా ఆరు నెలలకు ఒకసారి అందించడం జరుగుతుందని అన్నారు.

న్యాయవాదుల స్పందన:

యువ న్యాయవాది చదలవాడ మధులత :

చాగల్లు మండలం చెందిన యువ న్యాయవాది చదలవాడ మధులత మాట్లాడుతూ, విజయవాడ హై కోర్టులో 2022 న్యాయవాదిగా నమోదు చేసుకుని, కాకినాడ కోర్టు లో ప్రాక్టీసు చేపట్టడం జరిగిందన్నారు. వైయస్ఆర్ లా నేస్తం కింద అందచేస్తున్న రు.5 వేల స్టైఫండ్ ఎంతో ఉపయోగం పడుతుందని అన్నారు. నా వృత్తి పరంగానూ, పుస్తకాలు కొనండానికి,  పేదల కోసం నా వంతుగా కేసు నమోదు సమయంలో సహాయం చేసేందుకు ఉపయోగ పడుతుందన్నారు. నా తల్లిదండ్రులపై భారం కాకుండా న్యాయవాద వృత్తి కొనసాగింపు కోసం ఈ మొత్తం ఉపయోగ పడుతుందని, సిఎం జగన్ మోహన్ రెడ్డి కి మా యువ న్యాయవాదుల తరపున కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

యువ న్యాయవాది సునీత:

రాజమహేంద్రవరం కి చెందిన యువ న్యాయవాది సునీత మాట్లాడుతూ, న్యాయవాద వృత్తిలో గత ఏడాది రావడం జరిగిందని, ఆ సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ఆర్ లా నేస్తం కింద ప్రతి నెలా 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఎంతో మేలు జరిగిందని పేర్కొన్నారు. ఆ మొత్తం మా వృత్తికి వ్యక్తిగత ఖర్చులకు చేదోడు వాదోడుగా నిలిచిందని అన్నారు. ఇందుకు సిఎం కు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.

సీనియర్ న్యాయవాది వివి ఎస్ బి రాజు

సీనియర్ న్యాయవాది వివి ఎస్ బి రాజు మాట్లాడుతూ, 25 సంవత్సరాల నుంచి ఈ వృత్తిలో ఉంటున్నట్లు తెలిపారు. మేము కొత్తగా వృత్తిలోకి వచ్చిన సమయంలో ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి, 20 నుంచి 25 కిమి దూరం ప్రయాణం చేసి కోర్టు కి హాజరవుతుండే వారమన్నారు. ఆ రోజుల్లో మాకు ప్రభుత్వ పరంగా గానీ, కోర్టుల ద్వారా గానీ, మా సీనియర్ న్యాయవాదుల ద్వారా కానీ ఎటువంటి చేయూత ఉండేది కాదన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తున్న లా నేస్తం యువ న్యాయవాద వృత్తిలోకి వొచ్చే ఎంతో ఆర్ధిక భరోసా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.  కరోనా విపత్కర పరిస్థితుల్లో న్యాయవాద వృత్తిలో ఉండే వారికి భరోసా ఇచ్చిన ఘటన ప్రపంచంలో మరెక్కడా జరిగి ఉండలేదన్నారు. యువ న్యాయవాదులకు వారి వృత్తిని కొనసాగించే అవకాశం కల్పించే విధంగా స్టైఫండ్ కల్పించడం పట్ల సిఎం కు కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం వారి వృత్తికి సంబంధించిన ఖర్చులు, పుస్తకాలు కొనండం కోసం, పేదలకు సహాయం చేయడం కోసం సద్వినియోగం చేసుకోవడం ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పిడి డిఆర్డిఎ ఎస్ సుభాషిణి, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి జీ. జనార్ధన రావు,  జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె ఎన్ జ్యోతి, జిల్లా బిసి సంక్షేమ అధికారి పి ఎస్ రమేష్ , కలెక్టరేట్ సూపరింటెండెంట్ కే.శ్రీనివాస రావు, న్యాయ వాదులు సయ్యద్ ఎమ్ ఎస్ హుస్సేన్, ఎండి అబ్దుల్ అరీఫ్, వై అశోక్ కుమార్, పి వివి ఎస్ బి రాజు, ఎస్. ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 13వ తేదీన మంగళగిరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *