తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా మొట్ట మొదటిసారిగా ఒక నియోజకవర్గంలోని ప్రజలందరికీ పెద్ద ఎత్తున వైద్య పరీక్షలు నిర్వహించి అసంక్రమిత వ్యాధుల నిర్ధారణ చేసి రోగం ముదరకుండానే వారికి చికిత్స అందించే దిశలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించాలని ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైద్య పరీక్షలకు నడుం బిగించారని, అందులో భాగంగా అసంక్రమిత వ్యాధి నిర్ధారణ రక్త పరీక్షలు, ఈసీజీ పరీక్షలు తుడా సహకారంతో నేటి సోమవారం ఉదయం కలెక్టరేట్ లోని వివిధ శాఖల సిబ్బందికి మరియు తుడా సిబ్బందికి డ్రై రన్ లో భాగంగా రక్త పరీక్షలు ఈసీజీ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈనెల 24న అనగా నేటి సోమవారం ఉదయం 7 గంటలకు జిల్లా కలెక్టరేట్లోని వివిధ శాఖల సిబ్బందికి మరియు తుడా సిబ్బందికి సుమారు 3000 రూపాయల విలువ చేసే రక్త పరీక్షలు మరియు ఈసీజీ పరీక్షలు ఉచితంగా చేపట్టడం జరుగుతుందని, పరీక్షలు చేయించుకునేందుకు వచ్చే ఉద్యోగస్తులు ఏమి తినకుండా ఫాస్టింగ్ తో రావాల్సి ఉంటుందని, అలాగే వారి ఆధార్ కార్డును రిజిస్ట్రేషన్ కొరకు మరియు ఫాలోఅప్ కొరకు తీసుకొని రావాల్సి ఉంటుందని ఈ అవకాశాన్ని సంబంధిత శాఖల ఉద్యోగస్తులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.