Breaking News

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన మహోత్సవం పాల్గొన్న : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆదివారం పటమట లోనిమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 330 వ ఆరాధన గురుపూజ మహోత్సవంలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఏ వింత జరిగిన బ్రహ్మం గారు ముందే చెప్పారు అనే నానుడి ఉంది.. భవిష్యత్తును వారి కాలజ్ఞాన తత్వాలుగా వ్రాసిన మనకు అందించిన మహనీయుడునేడు యావత్ భారత దేశంలో కలియుగ ప్రత్యక్ష దైవంగా కీర్తించబడుతున్న యుగపురుషుడు బ్రహ్మం గారు అని తెలియజేసారు.అంటరానితనం నిర్మూలనకు ,,స్త్రీ ,పురుషుల సమాన హక్కులకు ,,కులమత బేదం లేని సమసమాజ నిర్మాణానికి నాటి అగ్రకుల వ్యవస్థపై తన పోరుసల్పిన నిజమైన ప్రజాస్వామ్యవాది అని కొనియాడారు.దాదాపు రెండు వేల మంది ప్రజలుకు అన్నసమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇంతటి బృహత్తర కార్యక్రమం చేపట్టిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ బీ.సీ.విభాగం నాయకులు తాటికొండ రంగబాబు గారిని మరియు దేవాలయం కమిటీ అధ్యక్షులు రేటూరి రత్నశేఖర్ గారిని ,యలవర్తి నాగభూషణం గారిని అభినందించారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వర్షాల నేపథ్యంలో మురుగునీటి ప్రవాహానికి ఎలాంటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *