Breaking News

ప్రతిపక్షాల కుట్రలను సమర్థవంతంగా త్రిప్పికొట్టాలి:దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9,10,11,15,18 డివిజన్ ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో రాష్ట్ర నాయకులు కడియాల బుచ్చిబాబు గారు, డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గ, ఫ్లోర్ లీడర్ శ్రీ వెంకట సత్యనారాయణ,మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ళ చల్లారావు , వల్లూరి ఈశ్వర్ ప్రసాద్, గద్దె కళ్యాణ్, ఉదయ్, పర్వతనేని పవన్ కుమార్ గార్లతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ పటిష్ఠతకు రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై, పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలు విజయవంతం చేయడానికి ప్రణాళికలు గురుంచి శ్రేణులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది.15వ డివిజన్ లో దాదాపు 12 కోట్ల రూపయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ డివిజన్ ని దత్తత తీసుకుంటున్నావ్ అని గొప్పలు చెప్పుకొని కనీసం ఒక్కసారి కూడా అసత్య ప్రచారాలతో నిత్యం ప్రజలు మోసం చేస్తున్నారు, అలాగే 18 వ డివిజన్ లో ఉన్న నాయకులు దొంగతనాలు కేసుల్లో ఉన్నారు ఇవన్నీ ప్రతీ వైసిపి కార్యకర్త ప్రజలకు వివరించాలని కోరుతున్నాను.మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని విజయ వంతం చేసిన క్లస్టర్ ఇన్ చార్గ్స్ కి, కన్వీనర్లకు, గృహ సారధులకు నాహృదయపూర్వక అభినందనలు. గడపగడపకు వెళుతున్న వైసీపీ నాయకులకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ వారి మద్దతు తెలియజేస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వెంకటరెడ్డి, బిక్షాల్ రెడ్డి, గుమ్మడి విజయ కుమార్, కాళికా రావు, బాలరాజు, సాయి కృష్ణారెడ్డి, కుమ్మరి నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, కొల్లిపారు శీను, కొండా మేస్త్రి,డాక్టర్MN రాజు,రంగబాబు, VB రెడ్డి, అబ్బ,బాలాజీ, మురళి, తిరుమలగిరి వెంకయ్య నాయుడు,చిన్న, సలీం, కలం, రెహమాన్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గుంటూరు నగరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మహిళా ఓటర్ల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం : నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Rt.No. 1165, MA&UD Department) ప్రకారం గుంటూరు నగర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *