-ఇకపై ప్రతి సోమవారం ఆర్డీవో రాజమహేంద్రవరం లో స్పందన ఆర్జీల స్వీకరణ
-కలెక్టర్ డా కే.మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి స్పందన కార్యక్రమం మే 1 వ తేదీ సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో, అదేవిధంగా డివిజన్ రాజమహేంద్రవరం, కొవ్వూరు రెవెన్యూ డివిజన్ అధికారుల కార్యాలయం లతో పాటుగా, మండల, గ్రామ స్థాయి, గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ప్రజలు నుంచి స్పందన అర్జీలు స్వీకరిస్తారని కలెక్టర్ మాధవీలత తెలిపారు. జిల్లా కలెక్టర్, ఇతర జిల్లా అధికారులు ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి వారం తరహాలోనే సోమవారం రాజమహేంద్రవరం రూరల్ లో హర్లిక్స్ ఫ్యాక్టరీ సమీపంలోని ఎన్ఎసి భవనంలోని కలెక్టరేట్ నకు ఆర్టీసి బస్టాండ్ నుంచి ఉచిత బస్సు సర్వీసు ఉ.9 నుంచి మ.2 వరకు నడుపుతున్నట్లు ఆమె తెలియచేశారు. కొత్త జిల్లా ఏర్పాటు చేసిన తరువాత కొవ్వూరు డివిజన్, ఇతర మండల, మునిసిపల్, తదితర క్షేత్ర స్థాయి కార్యాలయాల్లో స్పందన నిర్వహిస్తున్నామని తెలిపారు. మే 1 వ తేదీ ఇకపై ప్రతి సోమవారం ఆర్డీవో, రాజమహేంద్రవరం కార్యాలయం లో ఆర్జిలు స్వీకరించడం జరుగుతుందనీ కలెక్టర్ తెలియచేశారు. కొవ్వూరు, రాజమహేంద్రవరం పరిధిలో ఆర్డీవో లకు నేరుగా కూడా అర్జీలు అందచెయ్యవచ్చు నని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News