Breaking News

రబీ ధాన్యం సేకరణ పై జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ప్రకటన

-ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులు ఎవ్వరూ అధైర్య పడవద్దు…
-రైతులు మిల్లర్ల వద్దకు వెళ్ళాల్సిన అవసరం లేదు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుత రబీ 2022-2023 సీజన్ లో అంచనా వేసిన వరి సేకరణ 3.32 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా ఇప్పటి వరకు 39,422 మంది రైతుల నుంచి 2,53,611.226 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు కూపన్ లను జెనరేటు చేయడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ రోజు ఆన్ లైన్ లో 1448.880 మెట్రిక్‌ టన్నుల ధాన్యం, మొత్తం కలిపి ఈ రోజు వరకు 23804 రైతుల నుండి 217827.720 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చెయ్యడం జరిగినదన్నారు. ఇందుకు గాను ధాన్యం కొనుగోలు చేసిన వారం రోజులలోపే 19,440 FTO లకు గాను రూ.246.36 కోట్లను రైతుల యొక్క బ్యాంకు ఖాతాకు జమ చెయ్యుట జరిగినదన్నారు. మరో 5,594 FTO లకు గాను రూ.65.94 కోట్లు రైతుల యొక్క బ్యాంకు ఖాతాకు త్వరలో జమచేయడం జరుగుతుందని అన్నారు . ఎవరైనా రైసుమిల్లరు డబ్బులు డిమాండ్ చేసినట్లయితే సంబంధిత మండల అధికారికి లేదా కలెక్టరేటు కంట్రోల్ రూము నందు గల టోల్ ఫ్రీ నంబరుకు తెలియచేయగలరు. ధాన్యం కొనుగోలు విషయమై సందేహాలు మరియు ఫిర్యాదుల కొరకు జిల్లా కలెక్టరు వారి కార్యాలయం వద్ద కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. కంట్రోల్ రూమ్‌ ఉదయం 8.00 నుండి రాత్రి 8.00 గంటల వరకు అందుబాటులో కలదు. కంట్రోల్ రూమ్‌ నంబర్లు :- 8309487151 మరియు 0883-2940788.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“తాలీమ్-ఎ-హునర్ (వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్)” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలియజేయునదేమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *