జిల్లా వ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలు

-హాజరు కానున్న 19,336 మంది విద్యార్థులు
-జిల్లాలో 5 ఫ్లైఇంగ్ స్వాడ్ లు, 5 సిట్టింగ్ స్వాడ్ లు
-పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
-మొదటి ఏడాది పరీక్షలు ఉ.9 నుంచి 12 వరకు
-రెండవ ఏడాది పరీక్షలు మ.2.30 నుంచి సా.5.30 వరకు
-డి ఆర్వో జీ. నరసింహులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు అత్యంత పటిష్టంగా నిర్వహించాల్సి ఉంటుందని, జిల్లా వ్యాప్తంగా 36 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు పేర్కొన్నారు

శుక్రవారం సాయంత్రం డి ఆర్వో ఛాంబర్ లో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఆర్వో నరసింహులు మాట్లాడుతూ, జిల్లాలో మే 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షా సమయానికి గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. రాజమండ్రి డివిజన్ లో 25 కేంద్రాలు, కొవ్వూరు డివిజన్ లో 11 కేంద్రాలలో పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని, 144 సెక్షన్ అమలు ఉంటుందని పోలీసు అధికారులకు తెలియచేశారు. జిల్లాలో 3 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించామని, అక్కడ ప్రత్యేక పర్యవేక్షణ అవసరం అన్నారు. మొత్తం 5 ఫ్లైఇంగ్ స్వాడ్స్, 5 సిట్టింగ్ స్వాడ్స్ ను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసి ద్వారా ఆయా పరీక్షా కేంద్రాల రూట్ లలో ఉదయం సాయంత్రం బస్సులు నడిపెలా చర్యలు తీసుకోవాలని తెలియ చేశారు. పోస్టల్, పోలీస్, పంచాయతీ రాజ్, మునిసిపల్, తదితర శాఖల అధికారులు వారికి కేటాయించిన విధుల పై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, ఆయా పరీక్షా కేంద్రాల వద్ద పారిశుధ్యం, త్రాగునీరు వ్యవస్థ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

మొదటి ఏడాది పరీక్షకు 13131 మంది, 2వ ఏడాది పరీక్షకు 4498 మంది హాజరు కానున్నారని ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి ఎన్ ఎస్ వి ఎల్ నరసింహం తెలిపారు. ఒకేషనల్ విద్యార్థులు మొదటి ఏడాది 887 మంది, రెండో ఏడాది 820 మంది పరీక్షలకు హాజరు కానున్నరని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ మాధవీలత చైర్మన్ గా పరీక్షల నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు.  మొదటి ఏడాది పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, రెండవ సంవత్సరం పరీక్ష మ. 2.30 నుంచి సా.5.30 వరకు జరుగుతుందని తెలిపారు. మొత్తం 16 స్టోరేజ్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్లు తెలియచేశారు. మొదటి సంవత్సరం ఎథిక్స్ అండ్ మానవ విలువలు జూన్ 2 వ తేదీ ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, ఎన్వీరన్వమెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష జూన్ 3 వ తేదీ ఉదయం 10 నుంచి మ.1 గంటవరకు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ పరీక్షలలో తప్పనిసరిగా ఉత్తీర్ణత కలిగి ఉండాలని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా వొకేషనల్  అధికారి జె. వి. ఎస్. ఎస్. సుబ్రహ్మణ్యం, డి పి వో  పి. జగదాంబ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *