“వయో వృద్ధుల హక్కుల పరిరక్షణ”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో శుక్రవారం ఉదయం “వయో వృద్ధుల హక్కుల పరిరక్షణ” పై సంబంధిత శాఖల అధికారులతో మరియు ఎన్.జీ.వో సంస్థలతో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి మాట్లాడుతూ వయస్సు పైబడిన తల్లిదండ్రులను, వారి తల్లిదండ్రులను మర్యాదగా ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత వారి పిల్లలకు ఉంటుందని అన్నారు. వారి కనీస అవసరాలను సమకూర్చక పోయినా వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించినా చట్ట పరమైన చర్యలు తీసుకునే హక్కు వృద్ధులకు ఉందని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఇందుకోసం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నందు కానీ ఆర్.డి.వో ట్రిబ్యునల్ నందు కానీ ఫిర్యాదు చేయవచ్చు నని తెలియ చేశారు. నల్సా వారి “వయోవృద్ధులకు న్యాయ సేవల పథకం, 2016 ”.పై , వివిధ రకాల దస్తావేజులు – వాటి రద్దు ప్రక్రియలు, రివర్స్ మోర్ట్గేజ్, తదితర అంశాలను గురించి అవగాహన కల్పించారు. ఈ సదస్సులో డిసేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ వి. కామరాజు, తూర్పు గోదావరి జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె. మదన్ మోహన్ రెడ్డి, సీనియర్ సిటిజన్ ప్రజా సంక్షేమ వేదిక ప్రెసిడెంట్ అశోక్ కుమార్ జైన, వైస్ ప్రెసిడెంట్ ఎం. వీర్రాజు, పారా లీగల్ వాలంటీర్ జిఎస్వి.ఎస్.ఎస్. వరప్రసాద్, వివిధ ఎన్.జీ.వో సంస్థల వారు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *