-జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు
గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడివాడ పర్యటనను అన్నీ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఆనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రాజాబాబు అధికారులను ఆదేశించారు. త్వరలో కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లపై మంగళవారం మధ్యాహ్నం ఆయన గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో పలు శాఖల జిల్లా అధికారులతో సమావేశమై శాఖల వారీగా చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేయాలని టిడ్కో శాఖ తగిన ఫోటోలతో సమర్థవంతంగా ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. రవాణా శాఖ, ఆర్టీసీ సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిటిఓ సీతాపతికి కలెక్టర్ సూచించారు. గుడివాడ టౌన్ లో శానిటేషన్ సక్రమంగా ఉండాలని, ముఖ్యమంత్రి రాక సందర్భంగా పట్టణమంతా పరిశుభ్రంగా ఉండాలని పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ఎటువంటి అశ్రద్ధ వహించరాదని గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ కు సూచించారు. అలాగే వైద్య శిబిరాన్ని అంబులెన్స్ సదుపాయాన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో కల్పించాలని డిఎంహెచ్ ఓ డాక్టర్ గీతాబాయికి తెలిపారు. ముఖ్యమంత్రి సభకు తరలివచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు
తొలుత ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ మంత్రులు, మచిలీపట్నం, గుడివాడ శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) , కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) కలెక్టర్ పి. రాజాబాబు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి మల్లాయపాలెంలోని టిడ్కో ప్లాట్ల వద్ద బహిరంగసభ ప్రదేశాన్ని సందర్శించి ముఖ్యమంత్రి సభా వేదికకు ఏ మేరకు అనుకూలంగా ఉందోనని పరిశీలించి అధికారులకు తగు సూచనలు, ఆదేశాలిచ్చారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, జిల్లా ఎస్పీ పి. జాషువా, టిడ్కో ప్రాజెక్ట్ ఆఫీసర్ బి. చిన్నోడు, గుడివాడ ఆర్‌డిఒలు పద్మావతి, గుడివాడ మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ డిఆర్‌డిఎ పిడి, పి ఎస్ ఆర్ ప్రసాద్, హౌసింగ్ పిడి జీ.వి సూర్య నారాయణ తదితర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News