Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సమాచార శాఖ మంత్రి

-ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన రెడ్డిని అనుగ్రహించమని తిరుమల శ్రీవారిని కోరుకున్నా: సమాచార శాఖ మంత్రి

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి బుధవారం ఉదయం ప్రాతః కాల సమయంలో గౌ.రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ మరియు వెనుక బడిన తరగతుల శాఖా మంత్రి వర్యులు శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తిరుమల శ్రీవారిని సేవించి దర్శించుకున్నారు.

స్వామి వారి దర్శన అనంతరం ఆలయ వెలుపల మీడియా తో మంత్రి మాట్లాడుతూ ముందుగా ఓం నమో వెంకటేశాయ వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాణ్డె నాస్తి కించనః వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని స్వామి వారిని స్మరిస్తూ ఈ రోజు పెరుమాల్ని స్వామివారిని దర్శించుకున్నానని తాను ప్రధానంగా వేడుకున్నది కోరుకున్నది ఏమంటే అంటూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం పాలనలోకి వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. గౌ. ముఖ్యమంత్రి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు సుస్థిరమైన జీవనాన్ని సాగించే దిశగా పాలన అందిస్తున్నారని అన్నారు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతున్న జగన్మోహన్ రెడ్డి పాలనపై కొంత మంది దురుద్దేశంతో బురద చల్లుతున్నారని, కానీ ముఖ్యమంత్రి సత్సంకల్పంతో స్వామి ఆశీస్సులతో పాలకుడైనటువంటి జగన్ మోహన్ రెడ్డి గారిని మరింతగా అనుగ్రహించమని, వారి మంచి ఆలోచనలు సిద్ధించాలని ఈ రాష్ట్రంలోని ప్రజల కష్టాలని తొలగించాలని, అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించమని స్వామి వారిని వేడుకున్నానని తెలిపారు.

అనంతరం మంత్రి తిరుమల నుండి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి తిరుగు ప్రయాణమయ్యారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *