హిందూ ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది : ఎస్ సి కమిషన్ మెంబర్ చల్లెం ఆనంద్ ప్రకాశ్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ధర్మాన్ని రక్షిస్తే అది మన రక్షిస్తుందని ఎస్ సి కమిషన్ మెంబర్ చల్లెం ఆనంద ప్రకాష్ తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక శ్రీ పద్మావతి అతిథి గృహం నందు దళిత గోవిందు అనే శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఎస్ సి కమిషన్ మెంబర్ మాట్లాడుతూ.. కుల వ్యవస్థ నిర్మూలన దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం దళిత గోవిందా అర్చకుల శిక్షణ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఈ శిక్షణలో 43 మందికి 15 రోజులు శిక్షణ ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు అర్చకులుగా నియమించడం జరుగుతుందని తెలిపారు. టిటిడి చైర్మన్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో దళిత గోవిందా అర్చక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం శుభదాయకమని అన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో శిక్షణ కోఆర్డినేటర్ హేమంత్ కుమార్, ట్రైనర్లు వెంకటేశ్వరరావు, అనకాపల్లి, రాంబాబు అనకాపల్లి, సూర్యప్రకాష్ విశాఖపట్నం, రాధా నంద్యాల, మనోరమ నంద్యాల, రోజా విశాఖపట్నం, అరుణబాయ్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెట్టుబడులు, ఉపాధి అవకాశాల కల్పనకు ఐదు సంస్థలతో ఎంఓయూల మార్పిడి

కుప్పం, నేటి పత్రిక ప్రజావార్త : కుప్పం మునిసిపాలిటీలోని కొత్తపేటలో ఏర్పాటు చేసిన డెవలప్‌మెంటల్ ప్రాజెక్ట్స్ అండ్ ఇనిషియేటివ్స్ గ్యాలరీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *