Breaking News

మాతా శిశుమరణాలను పూర్తి స్థాయిలో నిరోధించేలా చూడాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మాతా శిశు మరణాలు సంభవించకుండా, కనీస స్థాయికి తగ్గించి, దశల వారీగా మాతా శిశుమరణాలను పూర్తి స్థాయిలో నిరోధించేలా చూడాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖాధికారుల పై ఉందని జిల్లా కలెక్టర్‌ ఢల్లీి రావు అన్నారు.
శుక్రవారం కలెక్టర్‌ విడిది కార్యాలయ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో వివిధ కారణాలతో సంభవించిన మాతా శిశు మరణాలపై కలెక్టర్‌ డిల్లీరావు, సబ్‌ కమిటీలోని సంబంధిత ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, అంగన్‌వాడీ, ఆశ కార్యకర్త, మరణాలు సంభవించిన ప్రైవేటు ఆసుపత్రి వైద్యులతో నమోదైన కేసుల వివరాలు, మరణాలకు గల కారణాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మాతా శిశు మరణాల్లో వైద్యుల నిర్లక్ష్యం లేనప్పటికీ, ఇటువంటివి సంభవించకుండా చూడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. సకాలంలో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి ఎప్పటికప్పుడు గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలను నిర్వహించి రక్త హీనతను నివారించి హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచాలన్నారు. మరణాల నివారణకు వైద్యులు అంకిత భావంతో పనిచేయాలని, ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. వైద్యుల నిర్లక్ష్యం వలనే మరణాలు సంభవిస్తున్నాయనే భావన ప్రజల్లో కలగరాదన్నారు. వైద్య ఆరోగ్య రంగానికి కోట్లాది రూపాయల నిధులను ఖర్చుచేస్తూ, వైద్య ఆరోగ్య రంగంలో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది నూరు శాతం నియామకాలు చేసిన్నప్పటికి మాతా, శిశు మరణాలు సంభవించడం బాధాకరమని, ఇకపై ఇటువంటివి పునరావృతం కారాదని, పునరావృతం అయితే సంబంధిత పిహెచ్‌సి వైద్యుల నిర్లక్ష్యంగా భావించవలసి ఉంటుందని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
సమావేశంలో మే నెలలో జరిగిన మూడు మాతృ మరణాలను, 36 శిశు మరణాలను, సంభవించిన కారణాలను సబ్‌కమిటీతో చర్చించారు.
మాతృ మరణం సంభవించిన పూసల అనురాధ భర్త శంకర్‌ను వివరాలు అడిగి తెలుసుకుని ముగ్గురు పిల్లలను వసతి గృహ పాఠశాలలో చేర్పించి ఆశ్రయం కల్పించాలని కలెక్టర్‌ డిల్లీరావు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ, సమగ్ర శిక్ష అధికారులను ఆదేశించారు.
సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. యం. సుహాసిని, ఐసిడిఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి. ఉమాదేవి, డిప్యూటి డియం అండ్‌ హెచ్‌వో డా. వై నళినిదేవి, డా. పద్మవతి, డిపిహెచ్‌ఎన్‌వో కె.ఎల్‌ లిడియా, గైనికాలజిస్ట్‌ డా. హిమబిందు, పిడియాట్రిక్స్‌ డా. ప్రభావతి, పిహెచ్‌సి సూపర్‌వైజర్లు, ఎఎన్‌యంలు, ఆశ కార్యకర్తలు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *