విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యన్.టి.ఆర్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణా విభాగం, స్నేహ మరియు వాసవ్య మహిళా మండలి సంయుక్త ఆధ్వర్యంలో గవర్నమెంట్ పాఠశాలల విధ్యార్ధులకు హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై మంగళవారం స్థానిక బిషప్ అజరయ్య పాఠశాల నందు క్విజ్ పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా స్నేహ సంస్థ ప్రివెంషన్ యూనిట్ ప్రాజెక్ట్ మెనేజరు కె.రవిశంకర్ మాట్లాడుతూ యన్.టి.ఆర్ జిల్లా ఎయిడ్స్ నియంత్రణా విభాగం సహకారంతో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా విజయవాడలోని గవర్నమెంట్ పాఠశాలలకు హెచ్.ఐ.వి పై క్విజ్ పోటీలను ఏర్పరచామని ఇందులో కె.యస్.ఆర్ జడ్ పి, కె.బి.సి.జడ్ పి, బిషప్ అజరయ్య, బోయపాటి శివరామ కృష్ణయ్య, గాంధీ మున్సిపల్, యస్.కె.పి.వి.పి హైస్కూల్లు నుండి విధ్యార్ధినీ విధార్ధులు పాల్గొన్నారన్నారు. ఇందులో మొదటి బహుమతిని కె.బి.సి.జడ్.పి. బాలుర పాఠశాలవారు, ద్వితీయ బహుమతిని బోయపాటి శివరామ కృష్ణయ్య హైస్కూలు వారు, మూడవ బహుమతిని బిషప్ అజరయ్య పాఠశాల గెలుపొందిందని ఆయన అన్నారు. వీరికి నగదు బహుమతితో పాటుగా ప్రశంసాపత్రాలను శుక్రవారం జరిగే ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నాడు స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అందజేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవ్య మహిళా మండలి సిబ్బంది వి. రాజామోహన్, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News