-ఐదు అంశాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది
-పురుషుల, స్త్రీ ల విభాగాల్లో రెండేసి బృందాల ఎంపిక జరగాలి
-డిసెంబర్ 13 వరకు పేర్లు నమోదు కు అవకాశం
– కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అన్ని గ్రామ, వార్డ్ సచివాలయ పరిధిలో “ఆడుదాం ఆంధ్రా ” ప్రోగ్రామ్ కు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నవంబర్ 27 నుండి ప్రారంభించడం జరిగిందని, ఆయా సచివాలయ పరిధిలోని వాలంటీర్లు 15 సంవత్సరాలు నిండిన వారు క్రీడల్లో పాల్గొనే ఆసక్తి ఉన్న వారి పేర్లు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
సంబంధిత సచివాలయలలో డిసెంబర్ 13 వరకు పేర్లు నమోదు అవకాశం ఉందని పేర్కొన్నారు. నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎంపీడీఓ లు, మునిసిపల్ కమిషనర్ లు ఆయా సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్ ల ద్వారా పేర్లు నమోదు వేగవంతం చేయాలని ఆదేశించారు.
కబడ్డీ, ఖోఖో, బ్యాట్మింటన్, వాలీబాల్, క్రికెట్ వంటి ఐదు క్రీడాంశాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఏదైనా రెండు క్రీడా పోటీలలో మాత్రమే వారి పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ఈ క్రీడల్లో వారి పేర్లు నమోదు చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేశారు.
ప్రతి గేమ్ కి 2 జట్లను ఎంపిక చేయవలసి ఉంటుందని, రెండు పురుషుల జట్లు, రెండు మహిళల జట్లు ను ఎంపిక చేయాల్సి వస్తుందని కలెక్టర్ తెలియ చేశారు. కబడ్డీ జట్టుకు 12 మంది చొప్పున రెండు జట్లు, ఖోఖో జట్టు కు 16 మంది చొప్పున రెండు జట్లు, క్రికెట్ జట్టుకు 16 మంది చొప్పున రెండు జట్లు, వాలీబాల్ జట్టుకు 12 మంది చొప్పున రెండు జట్లు, బ్యాట్మింటన్ జట్టుకు ఇద్దరు చొప్పున రెండు జట్లను ఎంపిక చెయ్యవలసి ఉంటుందన్నారు.
క్రీడా పోటీలు జరిగే షెడ్యూల్ వివరాలు తెలియ చేస్తూ, గ్రామ వార్డు సచివాలయా లలో డిసెంబరు 15 నుండి 20 వరకు, మండల, మునిసిపల్ స్థాయి లో డిసెంబరు 21 నుండి జనవరి 4 వరకు , నియోజకవర్గ పరిధిలో జనవరి 5 నుండి జనవరి 10 వరకు, జిల్లా స్థాయి లో జనవరి 11 నుండి జనవరి 21 వరకు ఆటల పోటీలు నిర్వహించ నున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయి లో గెలుపొందిన వారు , జనవరి 22 నుండి 26 వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది అని తెలియ చేశారు.
జిల్లాలోని 512 గ్రామ వార్డు సచివాలయాల్లో పురుషుల, స్త్రీల, వీక్షకుల పేర్లు నమోదు చేయాలని, ఇప్పటికే సచివాలయాలు వారీగా ఎంత మంది పేర్లు నమోదు చెయ్యవలసి ఉంటుందన్నారు. బుధవారం నాటికి 9 శాతం మేర పేర్లు నమోదు చేశారని, ప్రతి వాలంటీర్ కి ఆయా సచివాలయం పరిధిలో లక్ష్యం ఇచ్చి పేర్లు నమోదు వేగవంతం చేయాలని ఆమేరకు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మునిసిపల్, మండల పరిధిలోని అధికారులు, డివిజనల్ అభివృద్ధి అధికారులు క్షేత్ర స్థాయి లో సమావేశాలు నిర్వహించి నమోదు వేగవంతం చేయాలని కోరారు.
Prajavartha Online Telugu News