పలు రెస్టారెంట్ల పై విజిలెన్స్ అధికారుల ఆకస్మిక దాడులు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచనల మేరకు వినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారపధార్ధములు అందించాలని, లేనిచో సంబందిత రెస్టారెంట్ల పై  చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రీజనల్ విజిలెన్స్ ఇంచార్జ్ ఎస్.పి. ఎ .సురేష్ బాబు అన్నారు.

గురువారం జిల్లాలోని రాజమహేంద్రవరం పట్టణములోని పలు రెస్టారెంట్ల పై విజిలెన్స్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాలజి అధికారులు మరియు రెవెన్యూ అధికారులతో కలిసి మూడు రెస్టారెంట్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జవాహరలాల్ నెహ్రూ రోడ్ లో గల ఐరన్ హిల్ బార్ & రెస్టారెంట్ ను తనిఖీ చేసిన విజిలెన్స్ బృందంలోని లీగల్ మెట్రాలజి అధికారులు ITC కంపెనీ కు చెందిన క్లాసిక్ 1cc బ్లాస్ట్ సిగరెట్ ప్యాక్ మరియు గోల్డ్ ఫ్లేక్ సిగరెట్ ప్యాక్ గరిష్ఠ అమ్మకపు ధర రూ. 170/- వుండగా రూ. 237/-లకు అమ్మినందులకు గాను LMPC రూల్స్ 2011లోని రూల్ 18(2) ప్రకారం రెండు కేసులు మరియు ప్రామాణికం (నాన్-స్టాండర్డ్) కానీ మెజర్స్ జార్ లను కలిగి ఉన్నందుకు LM చట్టం 2009లోని సెక్షన్ 8/25 ప్రకారం ఒక్క కేసు ను నమోదు చేసామన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు రెస్టారెంట్ నందు చాక్‌లేట్ క్రాఫ్ట్ సిరప్ 2 బాటిల్స్ మరియు ఒక కంతరి చిల్లీస్ బాటిల్ గడువు ముగిసిన స్టాక్ కలిగి వుండుట చేత FSSAI చట్టం 2006లోని సెక్షన్ 27 r/w 58 ప్రకారం ఒక్క కేసును, సదరు రెస్టారెంట్ నందు ఉపయోగిస్తున్న ఎడిబుల్ ఆయిల్ నందు టోటల్ పోలార్ కాంపౌండ్స్ (TPC) మీటర్ రీడింగ్ 25% వుండవలసి వుండగా, 36% (TPC) వున్నందున FSSAI చట్టం 2011లోని 2.3.15(8) ప్రకారం మరొక కేసును నమోదు చేసామని, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు రెస్టారెంట్ నందు గల చికెన్ ధమ్ బిర్యానీ నమూనాను సేకరించి, నమూనాను విశ్లేషణ నిమిత్తం నాచారంలోని ఫుడ్ లాబరేటరీకి పంపిస్తామన్నారు.

టి.నగర్ లోని కుమారి థియేటర్ సమీపములో గల హోటల్ నెల్లూరు మెస్ ను తనిఖీ చేయగా సదరు రెస్టారెంట్ నందు 03 డోమెస్టిక్(గృహ) సిలిండర్లును గుర్తించటమైనది. సదరు డోమెస్టిక్(గృహ) సిలిండర్లును వాణిజ్య ప్రయోజనం కొరకు ఉపయోగించుట కారణముగా MSO, రాజమహేంద్రవరం(అర్బన్) వారు సదరు 03 డోమెస్టిక్(గృహ) సిలిండర్లును స్వాధినపర్చుకొని, సదరు రెస్టారెంట్ ఓనర్ అయ్యిన శ్రీ కోలా శ్రీను వారి పై u/s 6A ఆఫ్ E.C. చట్టం 1955 & LPG (సరఫరా & పంపిణీ నియంత్రణ) ఆర్డర్ 2000 క్రింద కేసు నమోదు చేసియున్నారు మరియు సదరు హోటల్ ను FSSAI లైసెన్స్ మరియు ట్రేడ్ లైసెన్స్ పొందకుండా నడుపుతున్నందున ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు హోటల్ యజమానికి నోటీసులు జారీచేసియున్నారు.

ఎ.వి.అప్పారావు రోడ్ లో గల శ్రీ కృష్ణ కల్యాణి ది వెన్యూ రెస్టారెంట్ ను తనిఖీ చేసిన విజిలెన్స్ బృందం సదరు రెస్టారెంట్ నందు ఉపయోగిస్తున్న ఎడిబుల్ ఆయిల్ నందు టోటల్ పోలార్ కాంపౌండ్స్ (TPC) మీటర్ రీడింగ్ 25% వుండవలసి వుండగా, 36% (TPC) వున్నందున FSSAI చట్టం 2011లోని 2.3.15(8) ప్రకారం ఒక్క కేసును నమోదు చేసియున్నారు మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు సదరు రెస్టారెంట్ నందు గల చికెన్ ఫ్రై బిర్యానీ నమూనాను సేకరించియున్నారు, సదరు నమూనాను విశ్లేషణ నిమిత్తం నాచారంలోని ఫుడ్ లాబరేటరీకి పంపనున్నారు.

జిల్లాలోని రెస్టారెంట్లలో ఉపయోగిస్తున్న ఎడిబుల్ అయిల్స్ లో టోటల్ పోలార్ కాంపౌండ్స్ (TPC) మీటర్ రీడింగ్ 25% లోపు వుండవలసి వుండగా దానికన్న ఎక్కువగా వుంటున్నాయని, దాని వలన ప్రజల ఆరోగ్యానికి హానికరం కావున టోటల్ పోలార్ కాంపౌండ్స్ (TPC) మీటర్ రీడింగ్ 25% లోపున వుండేలా రెస్టారెంట్ల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని లన్నారు. రెస్టారెంట్లు, బార్ల పరిసరాలు మరియు కిచెన్లు పరిశుభ్రముగా వుంచాలని, రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచనల మేరకు వినియోగదారులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారపధార్ధములు అందించాలని కోరియున్నారు, లేనిచో సంబందిత రెస్టారెంట్ల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని విజిలెన్స్ అండ్ అండ్ ఫోర్స్ మెంట్ ఇంచార్జ్ ఎస్.పి. ఎ .సురేష్ బాబు పేర్కొన్నారు.

ఈ తనిఖిలలో డి.ఎస్.పి ముత్యాలు నాయుడు, కార్యాలయ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరెడ్డి, నాగ వెంకటరాజు, జియాలజిస్ట్ లక్ష్మినారాయణ, వ్యవసాయ అధికారి భార్గవ మహేష్, సబ్-ఇన్స్పెక్టర్ జగన్నాధరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ జీవానందం, కానిస్టేబుల్స్ వలీ, లోవకుమార్ , కిషోర్, వీరబాబు మరియు రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *