ఈ నెల 3న ఎన్ఎంఎంఎస్ ప‌రీక్ష‌కు ఏర్పాట్లు పూర్తి

– ఎన్‌టీఆర్ జిల్లా డీఈవో సీవీ రేణుక‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2023-24 సంవ‌త్స‌రానికి సంబంధించి నేష‌న‌ల్ మీన్స్ క‌మ్ మెరిట్ స్కాల‌ర్‌షిప్స్ స్కీమ్ (ఎన్ఎంఎంఎస్‌) ప‌రీక్ష ఈ నెల 3వ తేదీన జ‌ర‌గ‌నుంద‌ని.. ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్ల‌ను పూర్తిచేసిన‌ట్లు ఎన్‌టీఆర్ జిల్లా డీఈవో సీవీ రేణుక గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటిగంట వ‌ర‌కు ప‌రీక్ష జ‌ర‌గ‌నుంద‌న్నారు. జిల్లాలో జెడ్‌పీ హైస్కూల్ (నందిగామ‌), శ్రీవిద్యా హైస్కూల్ (రైతుపేట‌, నందిగామ‌), శ్రీచైత‌న్య హైస్కూల్ (రైతుపేట‌, నందిగామ‌), నారాయ‌ణ ఈఎం హైస్కూల్ (రైతుపేట‌, నందిగామ‌), ర‌వీంద్ర‌భార‌తి ఈఎం హైస్కూల్ (నందిగామ‌), జెడ్‌పీ గర్ల్స్ హైస్కూల్ (న‌డిమి, తిరువూరు), గ‌వ‌ర్న‌మెంటు హైస్కూల్ (తిరువూరు), శ్రీనిధి టెక్నో హైస్కూల్ (తిరువూరు), కేబీసీ జెడ్‌పీ బాలుర హైస్కూల్ (ప‌ట‌మ‌ట‌, విజ‌య‌వాడ‌), కేఎస్ఆర్‌జెడ్‌పీ గ‌ర్ల్స్ హైస్కూల్ (ప‌ట‌మ‌ట‌లంక‌, విజ‌య‌వాడ‌), బీఎస్ఆర్‌కేఎంసీ హైస్కూల్ (ఎంజీ పురం, విజ‌య‌వాడ‌), ఏకేటీపీఎంసీ హైస్కూల్ (ఎస్ఎన్ పురం, విజ‌య‌వాడ‌), ఎంకే బైగ్ మెక్ ఎంసీ హైస్కూల్ (ఏఎస్‌న‌గ‌ర్‌, విజ‌య‌వాడ‌), గాంధీజీ ఎంపీఎల్ హైస్కూల్ (వ‌న్‌టౌన్‌, విజ‌య‌వాడ‌), బిష‌ప్ అజ‌ర‌య్య హైస్కూల్ (విజ‌య‌వాడ‌)లో ప‌రీక్ష జ‌ర‌గ‌నున్న‌ట్లు డీఈవో రేణుక వెల్ల‌డించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *