Breaking News

చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన హోంమంత్రి తానేటి వనిత

నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త :
రాస్త్రంలోని 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పని సరిగా వేయాలని, పోలియో రహిత సమాజాన్ని నిర్మించాలని రాష్ట్ర హోమ్ మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. నల్లజర్ల మండలంలోని నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద పోలియో కేంద్రంలో చిన్నారులకు ఆమె పోలియో డ్రాప్స్ వేశారు. ఆదివారం రాష్ట్రం వ్యాప్తంగా పోలియో బూత్ లు ఏర్పాటు చేసి గ్రామీణ, పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లోను, అన్ని వార్డు, విలేజి సచివాలయాల్లోనూ పోలియో డ్రాప్స్ వేయడం జరుగుతుందన్నారు. వీటితో పాటు అన్ని బస్సు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక బృందాలతో పల్స్ పోలియో చుక్కలను వేయడం జరుగుతుందన్నారు. అపుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు వయసు గల పిల్లలందరూ పల్స్ పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులను కోరారు. మార్చి 3న పోలియో బూత్ లలో వాక్సిన్ వేసుకోని చిన్నారులను గుర్తించి వారికి 4, 5 తేదీల్లో వారి ఇంటి వద్దనే పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, వైద్య సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“తాలీమ్-ఎ-హునర్ (వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్)” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలియజేయునదేమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *