Breaking News

దేవాదాయ శాఖ శ్రీ కమ్మవారి సత్రంలో పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ

-ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఉపకార వేతనాలు పంపిణీ చేసిన వైసిపి రాష్ట్ర నేత దుక్కిపాటి శశి భూషణ్….
-దాతలు అందించిన సహకారాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోని, ఉన్నత స్థాయికి చేరుకోవాలి…

గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గుడివాడ పట్టణం జగన్నాధపురంలోని దేవాదాయ శాఖ వారి శ్రీ కమ్మ సత్రంలో పేద విద్యార్థి, విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా 16 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల చొప్పున లక్ష అరవై వేల నగదును ప్రజా ప్రతినిధులతో కలిసి వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎందరో మహనీయులు భవిష్యత్తు తరాలకు మేలు చేయాలనే మంచి ఆశయంతో దశాబ్దాల క్రితమే ధార్మిక సంస్థలు నెలకొల్పారన్నారు. తరాలు మారిన నేటికీ ధార్మిక సంస్థల సేవలు కొనసాగుతున్నాయని, సంస్థల సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని శశిభూషణ్ సూచించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ అధికారులు గంగు శిరీష, నటరాజన్ షణ్ముగం, పర్వతనేని ఆనంద్, ఎంపీపీ గద్దె పుష్పరాణి, బొప్పన రమేష్, వడ్లమూడి నరసింహారావు, మోటూరి శివరామకృష్ణ, పాలడుగు రాంప్రసాద్, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *