-రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయం తథ్యం
-శాసనమండలి మాజీ స్పీకర్. యం ఎ షరీఫ్
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రచారం లో భాగంగా శుక్రవారం మైలవరం లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు తో కలిసి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంచాయితీ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో షరీప్ మాట్లాడుతూ రాష్ట్రం లో 130-140 సీట్లు వస్తాయని అన్ని సర్వేలు చెబుతున్నాయి. జగన్మోహన రెడ్డి పాలనలో ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుంపటి గా మారిందని అన్నారు. జగన్మోహనరెడ్డి ఐదేళ్ల పాలన లో పోలవరం ప్రాజెక్ట్ ను పక్కన పెట్టి రైతులను నట్టేట ముంచారు. మైనారీ ఓట్లు కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. క్రీస్టియన్ మైనార్టీ ల సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం మైనార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీ కి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ముస్లిం మైనార్టీ సోదరులు షరీప్ కి అపూర్వ స్వాగతం పలికారు.
Prajavartha Online Telugu News