-పలువురు సినీయర్ వైసిపీ నాయకులు వారి అనుచరులు తెలుగుదేశం లో చేరిక
మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం మైలవరం లో ఏర్పాటుచేసిన కార్యక్రమం లో వారికి తెలుగుదేశం పార్టీ కండవాలు కప్పి సాదర స్వాగతం ఎన్డీఏ కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాదు పలికారు. వైసిపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన వారిలో 2009, 2014 మైలవరం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన అప్పసాని సందీప్, కఠారి ఉమామహేశ్వరరావు,యర్రా రమేష్, కరెడ్ల సీతయ్య, అప్పసాని బాబురావు, తోటకూర ప్రసాదు, మేలిమి శివ అంజనేయిలు తో పాటు మరో 15 మంది వైసిపీ ని వీడి తెలుగుదేశం లో చేరగా ఎన్డీఏ కూటమి అభ్యర్థి స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు వారందరికి పేరు పేరునా సాదర స్వాగతం పలికి తెలుగుదేశం పార్టీ కండవాలు కప్పి సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం లో మైలవరం తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News