Breaking News

కార్మికుల కోసం న్యాయ విజ్ఞాన సదస్సు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి  స్థానిక శ్రీ వేంకటేశ్వర మార్కెట్ నందు తూర్పు గోదావరి జిల్లా కార్మిక శాఖ మరియు వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో కార్మికుల కోసం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ కార్మికులకు వారి హక్కులు గురించి వివరించారు. వారి సంక్షేమం కోసం అందుబాటులో ఉన్న పథకాలు, న్యాయ సేవల గురించి తెలిపారు. నల్సా వారి “అసంఘటిత రంగ కార్మికులకు న్యాయ సేవల పథకం, 2015” ద్వారా అందిస్తున్న సేవల గురించి తెలియజేశారు. కార్మికులకు ఉచిత న్యాయ సహాయం కావాలన్నా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సహకరిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ అసిస్టెంట్ కమీష్నర్లు ఎస్. దుర్గా రావు  కె.బాల సుబ్రమణ్యం, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ పి.ఎస్. చలం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కార్తీక్ ,  కార్మికులు పాల్గొన్నారు.

అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఎక్సైజ్ పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 14 వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు పరిష్కరించేందుకు పెండింగ్ లో ఉన్న ఎక్సైజ్ కేసుల వివరాలు, రాజీ పడదగిన కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ కేసులు పరిష్కరించుకొనేందుకు ఈ జాతీయ లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలన్నారు. ఈ సమావేశం లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదికార్లు, ఎక్సైజ్ అదికార్లు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం

శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా లో ఏపీ స్టేట్ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *