Breaking News

అనపర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

-రైతు కూలీల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది
-అస్వస్థత కు కారణాలు తెలుసుకోవడం జరుగుతుంది
-ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలోశ్రీధర్ నారాయణ రెడ్డి పొలం లో గుళికలు చల్లించేందుకు వ్యవసాయ కూలీలు రావడం జరిగిందని, వారు అస్వస్థత గురై ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడం జరిగిందనీ అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రైతు కూలీలకు పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఘటన వివరాలను అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలియ చేస్తూ , బిక్కవోలు మండలానికి చెందిన తొమ్మిది మంది వ్యవసాయ కూలీలు గుళికలు మందులు చల్లిన తరువాత స్వేధ తీసుకునే సమయంలొ అస్వస్థత కు గురి కావడం తో , వెంటనే అస్వస్థతకు గురైన తొమ్మిది మందిని అనపర్తి సి హెచ్ సి కి వైద్యం కోసం తీసుకుని రావడం జరిగిందన్నారు. పొలంలో పురుగుల మందు పిచికారీ చేయడం, దానిని పీల్చడం వల్ల లేదా నిలవ ఉన్న కలుషిత మజ్జిగ సేవించడం వలన అనే విషయం పై విచారణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైతు ఇచ్చిన ఫిర్యాదుతో 108 అంబులెన్స్ ద్వారా సిహెచ్‌సి అనపర్తిలో వైద్య సేవలు అందిస్తున్నట్లు శాసన సభ్యులు తెలిపారు . ప్రస్తుతం చికిత్స తర్వాత రోగులందరి ఆరోగ్యం స్థిరంగా ఉందని, వారితో స్వయంగా మాట్లాడడం జరిగిందన్నారు. రైతు కూలీల అస్వస్థత విషయం తెలిసిన వెంటనే ఆసుపత్రి లో వైద్యులు, సిబ్బంది అప్రమత్తం అయ్యారని, ప్రస్తుతం అందరీ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ డా టి ఆర్ గుర్రేడ్డి ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించడం జరుగుతున్నది. విషయం తెలుసుకున్న జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారిణి డా ఎన్ పి పద్మశ్రీ మెరుగైన వైద్య సేవలు కోసం సి హెక్ సి వైద్యులు తో మాట్లాడడం, తగిన సూచనలు ఇవ్వడం జరిగింది.

Check Also

ఏపీ స్టేట్‌ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ వెల్ఫేర్‌ ఆసోసియేషన్‌ ఆధ్వర్యంలో సభ్యత్య నమోదు కార్యక్రమం

శ్రీకాకుళం, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీకాకుళం జిల్లా లో ఏపీ స్టేట్ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *