విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా మరియు జిల్లా పంచాయతీ ఇంజనీరింగ్ అధికారిగా పనిచేసిన అక్కినేని వెంకటేశ్వర రావు సేవలు మరువలేనివని, ఆయన జిల్లాలో ఏ నియోజకవర్గంలో పనిచేసిన ప్రజలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులకు గౌరవాన్నిస్తూ పనులన్నిటిని చక్కబట్టారని, ఎక్కడ ఎటువంటి మచ్చ లేని మనిషి అక్కినేని వెంకటేశ్వరరావు అని, ఆయన పదవీ విరమణ డిపార్ట్మెంటుకు లోటు అని స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ తెలిపారు. విజయవాడ జ్యోతి కన్వెన్షన్ సెంటర్లో ఇంజనీరింగ్ సంఘం మరియు కాంట్రాక్టర్స్ సంయుక్తంగా నిర్వహించిన శ్రీ అక్కినేని వెంకటేశ్వరరావు పదవీ విరమణ సన్మాన సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రామ్మోహన్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ బాలునాయక్, డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ శివకుమార్,ఏపీ ఎన్జీవో నాయకులు A. విద్యాసాగర్, మాజీ శాసనసభ్యులు దాసరి బాలవర్ధన్ రావు,నీటి సంఘాల సమాఖ్య నాయకులు ఆల్ల గోపాలకృష్ణ, ఇంజనీరింగ్ సంఘాల నాయకులు మురళీకృష్ణ సంగీతరావు సోమేశ్వరరావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఇంజనీరింగ్ చీఫ్ బాలునాయక్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ విభాగంలో అక్కినేని వెంకటేశ్వర సేవలు మరువలేనిమని, ఆయనదొక ప్రత్యేక స్థానం అని, ఏ బాధ్యత అప్పజెప్పిన క్రమశిక్షణతో చక్కగా పూర్తి చేస్తారని తెలిపారు.
ఎన్జీవో సంఘ నాయకులు ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ 37 సంవత్సరాల ప్రస్థానంలో అక్కినేని వెంకటేశ్వరరావు అన్ని తరగతుల ఉద్యోగులతో మమేకమై మెలిగారని, ఎక్కడ అధికారాన్ని ప్రదర్శించకుండా, అందరిలో ఒకడు కా కొనసాగాడని, ఏ ఒక్కరోజు కూడా ఆయన మీద ఏ ఒక్క ఉద్యోగి ఫిర్యాదు చేసిన సందర్భంగా లేదని, జిల్లాలోని ఉద్యోగులందరికీ తరపున ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
అక్కినేని వెంకటేశ్వరరావు 37 సంవత్సరాల గా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ విభాగంలో వివిధ హోదాలలో సేవలందించారని, అందరు మనలను పొందుతూ యంత్రాంగంలో కీలకపాత్ర పోషించారని, ప్రతి నియోజకవర్గంలోనూ అందరితో చక్కని సంబంధాలు కలిగిన మంచి మనిషి అని, ఆయన పదవీ విరమణ డిపార్ట్మెంట్కే కాదు, అందరికీ లోటని వక్తలు కొనియాడారు. సన్మాన అనంతరం అక్కినేని వెంకటేశ్వరరావు దంపతులకు అతిధులు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ విభాగం ఉన్నత స్థాయి అధికారులు, కాంట్రాక్టర్స్, ఉద్యోగులు సన్మానించారు.