Breaking News

ప్రపంచ పర్యాటక దినం సెప్టెంబర్27 న రాష్ట్ర ముఖ్యమంత్రి చే వర్చువల్ విధానంలో చంద్రగిరి కోట సౌండ్ అండ్ లైట్స్ షో ప్రారంభం…..

-ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ పర్యాటక దినాన్ని ఈ నెల సెప్టెంబర్ 27న ఘనంగా నిర్వహించాలని, చంద్రగిరి కోట సౌండ్ అండ్ లైట్స్ షో ను ఆం.ప్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ గా అదే రోజున ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరం నందు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర పర్యటక శాఖ, లక్స్ అండ్ డెసిబెల్స్ ప్రైవేటు భాగస్వామ్యంతో సంయుక్తంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పి పి పి) విధానంలో సుమారు రూ.6 కోట్లతో చంద్రగిరి కోట నందు లైట్స్ అండ్ సౌండ్ షో ఏర్పాటుతో పర్యాటకులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేసి ఈనెల 27న గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల చేతుల మీదుగా వర్చువల్ విధానంలో ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చేపట్టాలి అని జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించి అధికారులను ఆదేశించారు. ఎపిటిడిసి డివిఎం, పర్యాటక శాఖ అధికారులు పూర్తి బాధ్యతగా ఏర్పాట్లు పక్కాగా ఉండేలా చూడాలని అన్నారు. సౌండ్ అండ్ లైట్స్ షో ఏర్పాటుతో చంద్రగిరి కోట నందు పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించే అవకాశాలు ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో పర్యాటక శాఖ ప్రాంతీయ సంచాలకులు డా. రమణ ప్రసాద్, ఏపీటిడిసి డివిఎం గిరిధర్ రెడ్డి, ఈఈ సుబ్రమణ్యం, జిల్లా పర్యాటక శాఖ అధికారి రూపేంద్ర నాథ్ రెడ్డి, కేంద్ర ఆర్కియాలజీ సబ్ సర్కిల్ ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్, లక్స్ అండ్ డిసిబుల్స్ ప్రతినిధి శివ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *