విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో నివసించే నగర ప్రజలకు బుడమేరు చాలా ఇబ్బందికరమైన సమస్యగా ఉన్నదని బుడమేరు సమస్య పై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం అని అన్నారు సందర్భంగా విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ విజయవాడ నగరం మొత్తం నీటిలో మునిగిపోయి చాలామందికి ఆస్తి నష్టం ప్రాణ నష్టం, వ్యాపారస్తులు అందరూ. కూడా చాలా నష్టపోయారు. కృష్ణా జిల్లా లొ నీటి కొరత నివారించటం, బుడమెరుపై చెక్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టాలని కోరుతూ అక్టోబర్ 3న విజయవాడ ధర్నా చౌక్ లొ రిలే నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఆర్.పి.ఐ జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వర రావు తెలిపారు. నగరానికి దశాబ్దాలుగా పాలకులు బుడమేరు కు శాశ్వత పరిస్కారం చూపించ లేకపోతున్నారని తెలిపారు. మరో పక్క కృష్ణా నది నీరు వృధాగా 13 లక్షల క్యూసెక్కుల సముద్రం పాలవుతుం దని ఆవేదన వ్యక్తం చేసారు. నీటిని నిలువ చేసుకోలేకపోతె రాబోయే రోజుల్లో పెద్ద సమస్యగా నగరం మారబోతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు, వంద రోజుల్లో వంద వినతి పత్రాలు ఇచ్చాము, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించక పోగా గత పాలకుల నిర్లక్ష్యం అంటూ కాలం వెళ్ళబుచుతున్నారని తెలిపారు. రాష్ట్ర ఎం.పీ లు పార్లమెంట్ లో గళం విప్పాలి నదుల అనుసం ధానం పై నిలదీయాలి, నీటిని మల్లించి స్టోరేజ్ చేయాలి ఆ విదంగా ఎంపీ లు గళం విప్పాలి. రాష్ట్ర ప్రయోజనల్ని కాపాడాలి అని కోరారు. పక్క రాష్ట్రాలు నీటిని భద్ర పరచటంలో చాలా చొరవ చూపిస్తున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించి నీటి నిల్వ కోసం ప్రాజెక్ట్ లు నిర్మించాలి అని డిమాండ్ చేస్తున్నాము. అక్టోబర్ మూడున జరిగే రిలే నిరాహార దీక్షను విజయ వంతం చేయాలని, టీటీడీ లడ్డు వివాదం పై సిబిఐ ఎంక్వయిర్ చేసి సత్వర న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని తెలిపారు.
Tags vijayawada
Check Also
దాడి పూర్ణిమను ఆశీర్వదించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ దాడి అప్పారావు మనవరాలు, తెలుగు యువత నాయకులు …