Breaking News

నాలుగు రోజుల్లో రూ. 175.54 కోట్ల విలువైన బ్యాంకింగ్ సేవ‌లు క‌ల్పించాం

– 3,136 ఖాతాల‌కు సంబంధించిన ద‌ర‌ఖాస్తులు ప‌రిష్కరించాం.
– రూ. 164.95 కోట్ల రీషెడ్యూలింగ్‌తో పాటు కొత్త‌గా రూ. 10.59 కోట్ల రుణాలు మంజూరు చేశాం.
– జిల్లా కలెక్ట‌ర్ డా. జి.సృజ‌న

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముంపు ప్ర‌భావిత ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని బ్యాంకింగ్ సేవ‌లు అందించ‌డం జ‌రుగుతోంద‌ని.. నాలుగు రోజుల్లో మొత్తం 3,136 ఖాతాల‌కు సంబంధించి రూ. 175.54 కోట్ల విలువైన బ్యాంకింగ్ సేవ‌లు అందించిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
2,145 రుణ ఖాతాలకు సంబంధించి రూ. 164.95 కోట్ల‌కు రీషెడ్యూలింగ్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. కొత్త రుణాల ద‌ర‌ఖాస్తుల‌ను కూడా త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించ‌డం జ‌రుగుతోంద‌ని.. ఇప్ప‌టివ‌ర‌కు కొత్త‌గా 991 ఖాతాల‌కు రూ. 10.59 కోట్ల మేర రుణాలు మంజూరు చేసిన‌ట్లు తెలిపారు. ఇందులో 424 ఖాతాల‌కు రూ. 1.05 కోట్ల మేర వినియోగ రుణాలు మంజూరు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. సోమ‌వారం ఒక్క‌రోజే 245 ఖాతాల‌కు సంబంధించి రూ. 16.72 కోట్ల మేర రుణాల‌ను రీషెడ్యూలింగ్ చేయ‌డంతో పాటు కొత్త‌గా 151 ఖాతాల‌కు రూ. 1.33 కోట్ల రుణాల‌ను మంజూరు చేసిన‌ట్లు వివ‌రించారు. ఇందులో 114 ఖాతాల‌కు రూ. 28 ల‌క్ష‌ల మేర వినియోగ రుణాలు మంజూరుచేసిన‌ట్లు తెలిపారు. బాధిత ప్ర‌జ‌లకు భ‌రోసా క‌ల్పించేందుకు ముందుకొచ్చిన బ్యాంకుల సేవ‌ల‌ను ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ సృజ‌న సూచించారు.
49.17 శాతం క్లెయిమ్‌ల ప‌రిష్కారం : భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లతో నష్టపోయిన, దెబ్బతిన్న వాహనాలు, ఇళ్లు, దుకాణాల‌తో పాటు చిన్న, మధ్యతరహా వ్యాపార సముదాయాలు వంటి ఆస్తుల‌కు సంబంధించిన బీమా క్లెయిమ్‌లను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించ‌డం జ‌రుగుతోంద‌ని.. ఇప్ప‌టివ‌ర‌కు చూస్తే మోటారు వాహ‌నాల‌కు సంబంధించి 11,046 క్లెయిమ్‌లు రిజిస్ట‌ర్ కాగా 5,399 క్లెయిమ్‌లు సెటిల్‌మెంట్ అయిన‌ట్లు తెలిపారు. అదే విధంగా నాన్ మోటార్ కేట‌గిరీలో 1,343 క్లెయిమ్‌లు రిజిస్ట‌ర్ కాగా వీటిలో 693 క్లెయిమ్‌లు సెటిల్‌మెంట్ అయిన‌ట్లు వివ‌రించారు. మొత్తంమీద 49.17 శాతం క్లెయిమ్‌ల సెటిల్‌మెంట్ జ‌రిగిన‌ట్లు తెలిపారు. బ్యాంకింగ్ సేవ‌ల‌తో పాటు బీమా క్లెయిమ్‌ల ప‌రిష్కారంపై గౌర‌వ ముఖ్య‌మంత్రి ప్ర‌త్యేకంగా దృష్టిసారించార‌ని.. నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తో క్లెయిమ్‌ల ప‌రిష్కారాన్ని వేగ‌వంతం చేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ సృజ‌న తెలిపారు.
అదే విధంగా ఎల‌క్ట్రీషియ‌న్‌, ప్లంబ‌ర్‌, పెయింట‌ర్‌, ఏసీ మెకానిక్ త‌దిత‌ర సేవ‌లు పొందేందుకు 59,629 మంది అర్బ‌న్ కంపెనీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నార‌ని.. ఇప్ప‌టివ‌ర‌కు నిక‌రంగా మొత్తం 5,841 స‌ర్వీస్ రిక్వెస్టులు న‌మోదయ్యాయ‌ని.. వీటిలో 95.6 శాతం మేర అంటే 5,603 విజ్ఞ‌ప్తుల‌కు సేవ‌లందించ‌డం పూర్త‌యింద‌ని క‌లెక్ట‌ర్ సృజ‌న వివ‌రిందారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *