విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గొల్లపూడి మార్కెట్ యార్డ్‌లోని ఈవీఎంలను భద్రపరిచిన గోదామును శనివారం జిల్లా కలెక్టర్ డా. జి.సృజన సాధారణ తనిఖీలలో భాగంగా పరిశీలించారు. ఈవీయంలను భద్రపరిచిన జిల్లా ఎలక్షన్ గోడౌన్ కు వేసిన సీల్డ్ లను, ఈవీఎంల రక్షణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం, వివి ప్యాట్ గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి సమగ్ర నివేదికను ఎన్నికల సంఘానికి పంపించవలసి ఉంటుందన్నారు. ఈవీఎం గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ నిర్వహించారు. తనిఖీలో కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సూపరిండెంట్ ఎం. దుర్గాప్రసాద్, కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది ఉన్నారు.
Prajavartha Online Telugu News