Breaking News

విజయవాడ రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా కె. చైతన్య బాధ్యతల స్వీకారం…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :

విజయవాడ రెవెన్యూ డివిజనల్‌ అధికారిగా నిమితులైన కె. చైతన్య శనివారం నగరంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. చింతూరు రెవెన్యూ డివిజనల్‌ అధికారి, ఇన్‌చార్జ్‌ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిగాను పని చేసిన కావూరి చైతన్యను సాధారణ బధిలీలలో భాగంగా విజయవాడ రెవెన్యూ డివిజనల్‌గా అధికారిగా నియమించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆర్డీవోను సబ్ కలెక్టరేట్ ఏవో హేమ కుమారి, విజయవాడ సెంట్రల్ తహసిల్దార్ సూర్యారావు, సబ్ కలెక్టరేట్ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *