-స్వచ్ఛత జీవనశైలిలో ఒక భాగం కావాలి
-రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్
-సోమవారం *రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన “స్వచ్ఛతా హీ సేవ -2024” కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ ప్రశాంతి కమిషనర్ కేతన గార్గ్.
-21,000 మందితో మానవహారం.. తద్వారా ప్రజల్లో చైతన్యం
-స్వచ్ఛతాహీ సేవలో ప్రజలు భాగస్వామ్యులు కావాలని పిలుపు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రాష్ట్ర వ్యాప్తంగా పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా నిర్వహించిన స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమం దిగ్విజయమైందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. సోమవారం ఉదయం రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నిర్వహించిన “స్వచ్ఛతా హీ సేవ -2024” కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంతితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ప్రజలకు, విద్యార్థులకి అభివాదం చేశారు. 21,000 మందితో ఏర్పాటు చేసిన మానవహారం కార్యక్రమం ప్రజల్లో చైతన్యం నింపిందన్నారు. వేలాది మందితో నిర్వహించిన ర్యాలీ ప్రతి ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం జాతిపిత మహాత్మాగాంధీ 151 వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో, అన్ని పట్టణాల్లో నిర్వహించిన స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు. ప్రజలంతా ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ స్వచ్ఛత ను అలవాటుగా మార్చుకోవాలని సూచించారు. ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను కూడా అదే విధంగా శుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ ప్రజలకు పిలుపునిచ్చారు.
కలెక్టరు పి ప్రశాంతి మాట్లాడుతూ, స్వచ్ఛత హి కార్యక్రమం తో పాటుగా, విజన్ 2047 కి ప్రతి ఒక్కరూ తప్పకుండా తమ వంతుగా అమూల్యమైన సూచనలు సలహాలు ఇవ్వడం ద్వారా రాష్ట్ర దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు.
మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శానిటరీ సిబ్బంది, యువతతో కూడి రికార్డు స్థాయిలో మానవ హారం కోసం పిలుపు నివ్వడం జరిగిందన్నారు. ఇందుకు పెద్ద ఎత్తున స్వచ్ఛంధం గా స్పందన రావడం జరిగిందన్నారు.
Prajavartha Online Telugu News