రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇసుక ఓపెన్ రీచ్ ల కేటాయించిన ” ఎల్ వన్ ” అభ్యర్థులు త్రవ్వకాలు నేపథ్యంలో జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మార్గదర్శకాలు, కనీస వేతనం సౌకర్యం కల్పించడం ద్వారా జవాబుదారీతనం ఉండేలా పర్యవేక్షణా తప్పనిసరి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ అనుసరించి అక్టోబర్ 16 నుంచి “ఎల్ వన్ ” అభ్యర్థులు ఇసుక త్రవ్వకాలు ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే జిల్లాలో 14 ఒపెన్ రిచ్ లని కేటాయించిన వివరాలు తెలియ చెయ్యడం జరిగిందని తెలిపారు. ఆమేరకు సంబంధిత బిడ్డర్ నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించడంపై పర్యవేక్షణా తప్పనిసరి అని స్పష్టం చేశారు. కనీసం రోజుకి 1000 మెట్రిక్ టన్నులు త్రవ్వకాలు చెయ్యాల్సి ఉంటుందన్నారు.
ఎటువంటి యంత్రములు వినియోగించరాదని, త్రవ్వకాల ప్రక్రియ కోసం పనిచేసే వారికి ఉపాధి హామీ కూలీ వేతనం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, ఆమేరకు క్షేత్ర స్థాయి అధికారుల పర్యవేక్షణ కీలకం అన్నారు. రీచ్ లలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడం, త్రవ్వకాలు, రవాణా, రికార్డుల నిర్వహణ, డెలివరీ తదితర అంశాల విషయంలో ఇప్పటికే సూచించిన సూచనలు ఎటువంటి డివియేషన్ రాకుండా చూసుకోవాలన్నారు. ఎన్జిటి మార్గదర్శకాలు మేరకు ఈ బోట్స్ మాన్ సొసైటీస్ డీసెల్ టేషన్ ప్రక్రియను చేపట్టేందుకు అనుమతులు జారీ చేశామని , అందుకు అనుగుణంగా రీచ్ లో ప్రారంభం కానున్నాయని తెలియ చేశారు. త్రవ్వకాలు కోసం నిర్దేశించిన ప్రకారం ఆయా “ఎల్ వన్” కార్యకలాపాలు పై విజులెన్స్ ఉండాలన్నారు. జిల్లా, డివిజన్ స్థాయి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతి వాహనానికి జియో టాకింగ్ సిస్టం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈమేరకు క్రాస్ చెక్ చెయ్యడం తో పాటు, డివియేషన్ చేసిన వారిపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. మండల పరిషత్ అభివృద్ది అధికారులు, సంబంధించిన పంచాయతీ కార్యదర్శులు తనిఖీలు ముమ్మరంగా నిర్వహించి, ఆమేరకు నివేదికను డివిజనల్ అభివృద్ది అధికారి కి పంపాలని కలక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు, అదనపు ఎస్పి ఏ వి సుబ్బరాజు , ఆర్డీవోలు ఆర్ . కృష్ణ నాయక్, రాణి సుస్మిత, ఏ డీ మైన్స్ డి. ఫణి భూషణ్ రెడ్డి, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి వై శ్రీనివాస్, ఇరిగేషన్ ఈ ఈ ఆర్. కాశీ విశ్వేశ్వరరావు, జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ , తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News