Breaking News

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకుల ఏర్పాట్ల పరిశీలన

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ఎంజీ రోడ్డు నందు పర్యటించి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకుల ఏర్పాట్లను పరిశీలించారు. అక్టోబర్ 21, 2024న జరిగే పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లకు అవసరమైన పార్కింగ్, గ్రౌండ్ అరేంజ్మెంట్స్, పెరేడ్ మార్కింగ్ ట్రాక్స్, త్రాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాట్లను పరిశీలించారు. వేడుకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూసుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వేడుకలు పారిశుద్ధ్య నిర్వహణ పక్కకు జరగాలని ఆదేశించారు. ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ డి చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖర్, టి శ్రీనివాస్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇంచార్జ్ డాక్టర్ సురేష్ బాబు, ఇంజనీరింగ్ శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

“తాలీమ్-ఎ-హునర్ (వక్ఫ్ ఎడ్యుకేషన్ మిషన్)” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి తెలియజేయునదేమనగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *