Breaking News

డ్రోన్ షో ఏర్పాట్ల పరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అక్టోబర్ 22, 2024 సాయంత్రం పున్నమి ఘాట్, బబ్బురి గ్రౌండ్స్ లో 5000 డ్రోన్లతో జరిగే డ్రోన్ షో ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఇంచార్జ్ నిధి మీనా, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర, సబ్ కలెక్టర్ కే చైతన్య శుక్రవారం ఉదయం పరిశీలించారు. డ్రోన్ షోకు అవసరమయ్యే ఏర్పాట్లను మ్యాప్ ద్వారా హాజరయ్యే ప్రముఖులకు, ప్రజలకు కనులకు పండగ చేసే డ్రోన్ షోకు, పటిష్టమైన ఏర్పాట్లు చేసేటట్టు చర్చించారు. ఈ పర్యటనలో చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇంచార్జ్ డాక్టర్ సురేష్ బాబు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే బేగ్, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, సూపరిండెంటింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ యస్ ఎన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *