-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డ్రెయిన్ల నిర్మాణ లేదా మరమ్మత్తుల సమయంలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తాత్కాలిక మార్గాన్ని కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం ఈఎస్ఐ హాస్పిటల్, గుణదల నందు పర్యటించి, అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈఎస్ఐ హాస్పిటల్ కి వెళ్ళుటకు తాత్కాలికదారిని ఏర్పాటు చేసి, త్వరతి గతిన పనులు పూర్తి చేయమని ఆదేశాలు ఇచ్చారు. అలాగే విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రధాన ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వారికి తాత్కాలికంగా దారిని ఉపయోగించేటట్టు చర్యలు తీసుకుని డ్రైన్లు పనులు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. డ్రైన్ నిర్మాణం,మరమ్మతుల వల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండాలని, ప్రజలు వినియోగించే మార్గానికి ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండాలని అన్నారు. ఈ పర్యటనలో సుపరిండెంటింగ్ ఇంజనీర్ వర్క్స్ పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇంచార్జ్ జి సామ్రాజ్యం, ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News