విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్, విజయవాడ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.19.10.2024 శనివారం నాడు విజయవాడ లోని జిల్లా ఉపాధి కార్యాలయం, ప్రభుత్వ ITI కళాశాల, రమేష్ హాస్పిటల్స్ రోడ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా నందు “జాబ్ డ్రైవ్” నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు(FAC) మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేసారు.
జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు(FAC), జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు మాట్లాడుతూ అధిక సంఖ్యలో నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అధ్వర్యంలో ఈ జాబ్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నామని మరియు ఉద్యోగం చిన్నదా, పెద్దదా అన్న అపోహను యువత పెట్టుకోవద్దని, ఉద్యోగం చేసుకుంటూ వెళ్తే అదే ఆ వ్యక్తులను ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది అని తెలిపారు.
ఈ జాబ్ డ్రైవ్ లో డైకిన్ (DAIKIN) వంటి ప్రముఖ కంపెనీ వారు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహించారని వారు తెలిపారు. మొత్తంగా 40 మంది ఇంటర్వ్యూలకు హాజరు కాగా, వారిలో 17 మంది ఎంపిక అయ్యరు అని తేలిపారు.