-గురునానక్ కాలనీలో గురుద్వార్ రోడ్డు శంకుస్థాపన
-రాష్ట్రంలో పరుగులు పెడుతున్న అభివృద్ది, సంక్షేమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం విజయవాడ కాలనీల్లోని రోడ్లను పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో విజయవాడ లో స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ సమస్యకి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ గురునానక్ కాలనీలోని గురుద్వార్ రోడ్డు నిర్మాణానికి గురువారం ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ఎంపీ కేశినేని శివ నాథ్ గురుద్వార్ ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివ నాథ్ మాట్లాడుతూ గురునానక్ కాలనీ వాసుల చిరకాల కల అయిన గురుద్వార్ రోడ్డుకి శంకుస్థాపన చేయటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో 4వ డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు విఎంసి కమిషనర్ ధ్యాన చంద్ర తో మాట్లాడి ఈ రోడ్డు నిర్మాణానికి 40 లక్షలు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు.2014-19 సమయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గంలో పలు డబల్ రోడ్లు పడ్డాయన్నారు . అదేవిధంగా ఎమ్మెల్యే గద్దె, కార్పోరేటర్ జాస్తితో కలిసి తూర్పు నియోజకవర్గంలోని డ్రైనేజీ రోడ్ల సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. గత ప్రభుత్వంలో స్ట్రాంగ్ వాటర్ పనులు ఏమీ జరగలేదన్నారు. ఇటీవల మంత్రి నారాయణ కు స్ట్రాంగ్ వాటర్ సమస్య గురించి వివరించగా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే విధంగా కృషి చేద్దామని .. త్వరలో ఎల్.అండ్ టి కంపెనీ రాబోతుందని చెప్పినట్లు తెలిపారు..
అనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీ పనులు నిలిపివేయటం వల్ల చిన్న వర్షం పడిన రోడ్లన్నీ చెరువుల తలపిస్తున్నాయన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం పనులన్నీ పరుగులు పెడుతున్నాయనీ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో విజయవాడ నగరం ఉన్నతమైన నగరం గా తీర్చి దిద్దుతామన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్ చలసానిరమణ , గురునానక్ కాలనీ ప్రెసిడెంట్ హరి మహేందర్ సింగ్ సహాని , గురుద్వార్ సింగ్ సభ ప్రెసిడెంట్ కమల్జిత్ సింగ్ , రాజామణి కిర్ పాల్ మోని ,హనీ , కాంట్రాక్టర్ రాధాకృష్ణ
,మన్మోహన్ సింగ్ ,కుల్దీప్ గౌర్ ,అరవిందర్ సింగ్ పింకీలతోపాటు స్థానిక ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.