Breaking News

అమరావతి జర్నలిస్టుల హౌసింగ్ స్కీం జీవోను అమలు చేయాలి

-APUWJ డి‌మాండ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జర్నలిస్టుల హౌసింగ్ స్కీం విషయంలో గతంలో అమరావతి జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ పేరిట ఇచ్చిన జీవోను పునరుద్ధరించాలని ఏపీయుడబ్ల్యూజే విజయవాడ యూనిట్, ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యవర్గం ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది. ఏపీయుడబ్ల్యూజె విజయవాడ యూనిట్, ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యవర్గ సమావేశం ఆదివారం అర్బన్ అధ్యక్షుడు చావా రవి అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు పాల్గొని కొత్త అక్రెడిటేషన్లు, జర్నలిస్టుల హౌసింగ్ స్కీం తదితర అంశాలపై రాష్ట్ర నాయకత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా హౌసింగ్ స్కీం విషయంలో గత తెలుగు దేశం ప్రభుత్వ హయంలో జారీ చేసిన ఉత్తర్వులపై చర్చించారు. గతంలో రాజధాని ప్రాంతంలో 30 ఎకరాలు అమరావతి సొసైటీకి కేటాయిస్తూ సీఆర్దియే హ్యాపీనెస్ట్ -3కింద నాలుగు కేటగిరీల్లో అపార్ట్మెంట్ లను నిర్మాణం చేసి ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది . దీనికి జర్నలిస్టుల వాటా కింద చెల్లించాల్సిన నగదుతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం భరించే రాయితీ ని కూడా ఖరారు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తిరిగి ఆ ఉత్తర్వులను పునరుద్ధరించడం ద్వారా జర్నలిస్టుల ఇంటి కల నిజం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టులకు నిబంధనల పేరిట కొర్రీలు వేయకుండా ఆక్రిడిటేషన్లు మంజూరు చేయాలని తీర్మానించారు. రాష్ట్ర స్థాయి ఎన్నికల నిర్వహణకు యూనియన్ అర్బన్ తరుపున మోదుమూడి మురళీ కృష్ణ ను ఎన్నికల అధికారిగా నియమిస్తూ మరో తీర్మానం చేశారు. సంయుక్త కార్యవర్గ సమావేశంలో యూనియన్ కార్యదర్శి దారం వేంకటేశ్వర రావు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు కంచల జయరాజ్, దాసరి నాగరాజు, ఐజెయు కౌన్సిల్ సభ్యులు షేక్ బాబు, ఏపీ ఎలక్ట్రాన్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యేచూరి శివ, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ రమణారెడ్డి, ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విజయభాస్కర్, రెండు కమిటీల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Check Also

రాష్ట్రంలో 6 గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల ఫీజిబులిటీ స్టడీ కోసం రూ. 2.27 కోట్ల నిధులు విడుదల చేయనున్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి

-కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్, తుని – అన్నవరం, తాడేపల్లి గూడెం, ఒంగోలులో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుల అభివృద్ధికి ప్రతిపాదనలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *