-ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఇక మీదట ఈ అంశంపై ఎలాంటి ప్రక్రియ కొనసాగకూడదని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి
-ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందవద్దు
-జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా
కర్నూలు, నేటి పత్రిక ప్రజావార్త :
కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ లో యురేనియం లభ్యత, పరిశోధన కోసం బోర్ల తవ్వకాల ప్రక్రియను ఆపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇక మీదట కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్ లో యురేనియం బోర్ల తవ్వకాల అంశానికి సంబంధించి ఎలాంటి ప్రక్రియ కొనసాగదని కలెక్టర్ పేర్కొన్నారు.కాబట్టి ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందవద్దని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.