Breaking News

“జాబ్ మేళా”

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ, డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.14.11.2024 గురువారం నాడు విజయవాడ లోని “నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) శిక్షణా కేంద్రం, B.c సాంఘిక సంక్షేమ బాలుర హాస్టల్, ఖబేలా భవనం వెనుక వైపు, రోటరీ నగర్, విద్యాధరపురం, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా” నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి.విక్టర్ బాబు (FAC) మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు సంయుక్తంగా తెలియజేసారు.

ఈ జాబ్ మేళాలో, Urban సంస్థ, ఇన్నోసోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (SBI కార్డ్స్), అపోలో ఫార్మసీస్ లిమిటెడ్, SBI పేమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు Fair Deal Capital వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కంపెనీ లలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, డిగ్రీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన 18 నుండి 60 సంవత్సరాల లోపు వారు అర్హులని, ఎంపిక అయిన వారికి నెలకు సుమారు రూ.12,000/- నుండి రూ.40,000/- ల వరకు వేతనముతో పాటు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, నవంబర్ 14 న నిర్వహించబోయే ఈ జాబ్ మేళాలకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు APSSDC సంస్థ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్. శ్రీనివాసరావు గారు తెలిపారు.

ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://tinyurl.com/jobmela-naipunyam లింక్ నందు తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ అయ్యి, సదరు జాబ్ మేళాకు రెజ్యూమె లతో లేదా బయోడేటా ఫోరమ్ లతో పాటు ఆధార్ మరియు సర్టిఫికెట్ల జిరాక్సు కాపీలతో రావాలని, మరిన్ని వివరాలకు 9700025833 నంబర్ను సంప్రదించాలని తెలిపారు.

Check Also

నిస్వార్థంగా సేవ చేయడమే తెలుగుదేశం పార్టీ సిద్థాంతం

–3వ డివిజన్‌లో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గోన్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *