Breaking News

పోర్ట్-లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోడ్పాటుతో ఆర్థిక వృద్ధిపై ఆంధ్రప్రదేశ్ దృష్టి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోర్ట్-లెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ద్వార పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పించి దీని ద్వార 2047 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ మార్చాలనే లక్ష్యాన్ని సాదించడానికి అంతర్జాతీయ భాగస్వామ్యాలను అన్వేషిస్తుంది. 2030 సంవత్సరం నాటికి ప్రపంచ స్థాయి నౌకాశ్రయ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలని లక్ష్యంతో మరియు శ్రేష్ఠమైన అంతర్గత వ్యవస్థలను నిర్మించి, ప్రపంచ మరియు దేశీయ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థిరమైన ఆర్థిక వృద్ధిని మరియు తీర ప్రాంత అభివృద్ధిని ప్రోత్సహించాలని భావిస్తుంది. మంగళవారం సెయోల్‌లో Export-Import Bank of Korea (KEXIM) ఆధ్వర్యంలో నిర్వహించిన 29వ ఆర్థిక అభివృద్ధి సహకార నిధి సదస్సులో, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ మరియు పెట్టుబడి శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ రాష్ట్ర దృక్పథాన్ని వివరించారు. సురేష్ కుమార్, KEXIM ఆహ్వానం మేరకు, రిపబ్లిక్ కొరియాలో ఐదు రోజుల అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా, కొరియా నౌకా నిర్మాణ రంగంలోని అగ్రశ్రేణి సంస్థలతో సమావేశాలు నిర్వహించి, ఆంధ్రప్రదేశ్‌లో నౌకా నిర్మాణం మరియు నౌకా మరమ్మత్తుల సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడానికి భాగస్వామ్యాలను అన్వేషిస్తున్నారు.

అంతే కాకుండా బుసాన్ పోర్ట్ అథారిటీ, హాంజిన్ ఇండస్ట్రీస్ మరియు హ్యూండై ఇండస్ట్రీస్ అధికారులతో సమావేశమై, నౌకాశ్రయ రంగంలో పెట్టుబడి కోసం రాష్ట్ర సామర్థ్యం మరియు ప్రయోజనాలను వివరించడంతో పాటు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం, ప్రపంచవ్యాప్త మరియు దేశీయ పెట్టుబడులను ఆకర్షించడం మరియు ఆంధ్రప్రదేశ్‌ను ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా స్థాపించడం ద్వారా స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని 2030 నాటికి భారతదేశంలో ప్రముఖ నౌకాశ్రయ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలబెట్టుకోవడమే లక్ష్యం అని సురేష్ కుమార్ సమావేశం లో తెలపడం జరిగింది. ఈ లక్ష్యాలను సాధించడానికి, రాష్ట్రం నూతన విధానాలను అవలంబిస్తోందని, సమర్థవంతమైన పాలన కూడా ఈ విషయంలో కీలకపాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. 2023లో రాష్ట్రంలోని ప్రధాన పోర్టు అయినటువంటి విశాఖపట్నం మరియు ఐదు మద్య తరహ పోర్టులు కలిసి 198 మిలియన్ టన్నుల సరుకును సరపరా చేసాయని తెలిపారు.

16,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మించిన రామాయపట్నం, మచిలపట్నం, కాకినాడ (గేట్‌వే) మరియు మూలపేట వంటి మరో నాలుగు మద్య తరహ పోర్టులు త్వరలోనే పనిచేయడానికి సిద్ధమవుతున్నాయని, 2025-26 నాటికి 110 మిలియన్ టన్నుల మేరకు రవాణా సామర్ధ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం, రాష్ట్ర ప్రభుత్వం పోర్ట్లు కు సంబంధించిన పారిశ్రామిక అభివృద్ధి ప్రదానంగ ప్రోత్సాహించాలని దీని ద్వార వేలాది ఉద్యోగాలను సృష్టించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలపరిచే దిశగా అడుగులు వేస్తోందని ఆయన తెలిపారు. పోర్ట్ కు సమీపంలో గల ప్రాంతాల అభివృద్ధి, షిప్ యార్డ్ల అభివృద్ధి మరియు అనుబంధ సముద్ర రంగ కార్యకలాపాలు, పోర్టు అభివృద్ధి పై దృష్టి సారించమని తెలిపారు. దీని కోసం రాబోయే గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ కొరకు 5000 ఎకరాల భూమి కూడా కేటాయించమని, పోర్ట్లు మరియు ఫిషింగ్ హార్బర్ ల అభివృద్దికి ప్రైవేటు భాగస్వాములను స్వాగతిస్తున్నామని సురేష్ కుమార్ సమావేశంలో తెలపడం జరిగింది.

Check Also

జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీ విరమణ వయసు పెంపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని న్యాయశాఖ జ్యూడిషియల్ ఆఫీసర్ల( న్యాయాధికారులు ) పదవీ విరమణ వయసును పెంపు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *